జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో డెఫినెట్ బ్లాక్ బస్టర్ అనేలా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ నిర్మాతకు ఎంత లాస్ తెచ్చిందో తెలియదు కాని ఒక్కో ఏరియాలో బీభత్సమైన రేంజ్ లో బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్ లు మాత్రం షాక్ అవుతున్నారు.


ముఖ్యంగా ఎన్నడు లేని విధంగా అజ్ఞాతవాసి సినిమాను నైజాం ఏరియా మొత్తం 29 కోట్లకు కొనేశాడు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ క్రేజ్.. త్రివిక్రం డైరక్షన్ సినిమాను కచ్చితంగా సూపర్ హిట్ చేస్తాయి అన్న నమ్మకంతో మారు మాట మాట్లాడకుండా అడిగినంత ఇచ్చేశాడు. తీరా సినిమా చూస్తే మాత్రం తీవ్ర నిరాశ పరచింది.


సినిమా బిజినెస్ కు వస్తున్న కలక్షన్స్ కు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. నైజాం లో 29 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటివరకు కేవలం 11 కోట్లు మాత్రం వసూళు చేసిందట. ఈ లెక్కన ఈ ఒక్క సినిమాకే దిల్ రాజు 18 కోట్ల దాకా లాస్ వచ్చిందని తెలుస్తుంది. నిర్మాతగా లాస్ట్ ఇయర్ వరుస విజయాలు అందుకున్న దిల్ రాజుకి ఈ ఇయర్ మొదట్లోనే అజ్ఞాతవాసి రూపంలో పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. 


కేవలం నైజాంలోనే కాదు.. అన్ని ఏరియాల పరిస్థితి ఇలానే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఫైనల్ గా అజ్ఞాతవాసి నిర్మాతకు ఎంత లాస్ తెచ్చిందన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఫిబ్రవరిలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.  



మరింత సమాచారం తెలుసుకోండి: