టాలీవుడ్ స్టార్ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి పేరు ఉంది. ఆయన రాసే పంచ్ లకు డైలాగులకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో దర్శకులు సైతం డైలాగులు రాస్తే త్రివిక్రమ్ లా రాయాలి అని బహిరంగంగా చెప్పిన వారు చాలామంది ఉన్నారు. ఇంత పేరు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తాను దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అవడం ద్వారా త్రివిక్ర‌మ్‌ని త‌ప‌స్వి అని నెత్తిన పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు కాపీ క్యాట్ అంటూ ముద్ర వేస్తున్నారు.

అయితే తాను తీసిన సినిమాలు ఫ్లాప్ అవడానికి బలమైన కారణమే ఉంది అని చాలామంది ఇండస్ట్రీకి చెందినవారు అంటున్నారు.అయితే ఈ క్రమంలో  తన గత సినిమాలు అప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన టీమ్ ఉండేది. సిరివెన్నెల‌ దేవిశ్రీ ప్ర‌సాద్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి… ఇలా ఓ టీమ్ ని ఏర్ప‌ర‌చుకున్నాడు. మెల్ల‌మెల్ల‌గా వాళ్ల‌లో ఒకొక్క‌రూ త్రివిక్ర‌మ్‌కి దూరం అవుతున్నారు. తన టీమ్ దూరం అవడం ద్వారా త్రివిక్రమ్ సినిమాలు పరాజయం చెందుతున్నాయి అని చాలామంది అంటున్నారు.
అయితే త్రివిక్ర‌మ్ మాట‌ల మాంత్రికుడు.

త‌న‌లోని ర‌చ‌యిత‌ని మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీసుకొచ్చే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయి. ర‌చ‌యిత ర‌చ‌యిత‌లానే ఆలోచిస్తే త్రివిక్ర‌మ్ నుంచి మ‌రిన్ని అద్భుతాలు చూడొచ్చు అనేవారూ లేకపోలేదు. అయితే ఎన్టీఆర్ కొత్త సినిమా విషయం లో కూడా ఒక నవల నుంచి కథ లేపెస్తున్నాడట త్రివిక్రమ్ అయితే, ఈ సారి మాత్రం కాపీ క్యాట్ అనిపించుకోకుండా దాని హక్కులు కొనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు అంటున్నారు. ఒకే ఒక్క సినిమా దెబ్బతో త్రివిక్రమ్ మొత్తానికి లైన్ లో పడ్డాడు, ఈ రకంగా అయినా అజ్ఞాతవాసి ప్లాప్ అవ్వడం త్రివిక్రమ్ కెరీర్ కి మంచి జరిగినట్టే అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: