టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పూరి దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.  మొదట్లో అనుష్క విపరతమైన గ్లామర్ ప్రదర్శన చేసింది..ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వేస్తూ వచ్చింది.  ఈ అమ్మడు స్వతహాగా యోగా టీచర్ కావడంతో తన బాడీ ఫిట్ నెస్ చాలా చక్కగా చూసుకుంటూ ఉండేది..కానీ కొన్ని సినిమాలో పాత్రల కోసం కాస్త లావు కావడంతో ఆంటిలా తయారైంది. 
Image result for anushka shetty
తాజాగా భాగ‌మ‌తి` సినిమా త‌ర్వాత సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని అనుష్క భావిస్తోంద‌ని, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డాల‌ని అనుకుంటోంద‌ని, అందుకే కొత్త సినిమాల‌ను అంగీక‌రించ‌డం లేద‌ని ఇటీవ‌లి కాలంలో వార్త‌లు బ‌య‌టికొచ్చిన విష‌యం తెలిసిందే. `భాగ‌మ‌తి` త‌ర్వాత అనుష్క చేతిలో సినిమాలేం లేవు.  అయితే అనుష్క కావాలనే సినిమాలకు దూరం అవుతున్నారా..లేక అవకాశాలు రావడం లేదా అన్న ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పింది అనుష్క. తనకు సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా అవకాశాలు మాత్రం రావడం లేదని అన్నారు. 
Image result for anushka shetty
ఒకప్పుడు అనుష్క డేట్స్ కోసం ఇంటి చుట్టు క్యూలు కట్టిన వారు ఇప్పుడు కంటికి కూడా కనిపించడం లేదట.   ప్ర‌స్తుతానికి నా చేతిలో సినిమాలేం లేవు. స్టోరీ డిస్క‌ష‌న్లు కూడా ఏమీ లేవు. క‌థ‌లు చెప్ప‌డానికి నా ద‌గ్గ‌ర‌కు ఎవ‌రూ రావ‌డం లేదు. ఇప్ప‌టికైతే నా చేతిలో సినిమాలేం లేవు. అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయితే చెబుతాన‌`ని అనుష్క చెప్పింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల హవా బాగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో అనుష్క, కాజల్, త్రిష లాంటి సీనియర్ నాయికలు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
Related image
ఇక క‌మ‌ర్షియ‌ల్ సినిమా్ల్లో అనుష్క‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. వాటిలో మొద‌టిది అనుష్క వ‌య‌సు. చాలా సీనియ‌ర్ అయిన అనుష్క ఇప్ప‌టి కుర్ర హీరోల ప‌క్క‌న సెట్ కావ‌డం లేదు. ఇక‌, ఇటీవ‌ల పెరిగిన బ‌రువు కూడా అనుష్క‌కు అడ్డంకిగా మారుతోంది. గత కొంత కాలంగా అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం వల్ల హీరోలతో సమానమైన మార్క్ సంపాదించింది..అలాంటిది ఇప్పుడు గ్లామర్ తరహా పాత్రల్లో కనిపించినా అభిమానులు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరని భావిస్తున్నారు. అందుకే అనుష్క‌కు సాధార‌ణ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాయ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: