టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ అమ్మడికి వరుస విజయాలు రావడంతో ఆ మద్య చాలా బీజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇక ఏం మాయ చేసావే సినిమాలో నటించిన అక్కినేని నాగ చైతన్య తో ప్రేమలో పడి కొంత కాలం సహజీవనం చేసి ఈ జంట గత సంవత్సరం గోవాలో రెండు సాంప్రదాయలు (హిందూ, క్రిస్టియన్) ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 
Image result for samantha chaitanya
ఇప్పుడు సమంత మామూలు హీరోయిన్ కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గౌరవం పొందిన అక్కినేని ఇంటి పెద్ద కోడలు.  ఎన్నో కట్టుబాట్లు సాంప్రదాయలు పాటిస్తున్న అక్కినేని ఫ్యామిలీ కోడలు అయినా సమంత ఇప్పుడు హీరోయిన్ గా కొనసాగుతూనే ఉన్నారు.  అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంతో తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
Related image
మనిషి తినే ఆహారం ఎలాగో సెక్స్ కూడా అలాగేనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి, ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సమంత, ఇప్పుడు ఓ ఉన్నత కుటుంబానికి కోడలిగా వెళ్లి కూడా, తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెబుతూనే ఉంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.  సమంత పోస్ట్ చేసిన వివరాల ప్రకారం...బిలీవ్ ఇన్ ది హజిల్... డోంట్ ఫ... విత్ లక్!' అని ఆమె వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది.
Related image
అదృష్టం కోసం వేచి చూడకుండా పోరాడాలని చెబుతూ స్ఫూర్తి నింపే మెసేజ్ ని ఆమె పోస్టు చేసినా, ఆమె వాడిన పదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్టుకు ఐదున్నర లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. మరీ ఇంత బోల్డ్ గా మెసేజ్ లు చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో..కొత్తగా చెప్పాల్సిన అవసరం లేద..మరి అక్కినేని కుటుంబానికి కోడలు అయి ఉండి ప్రతి విషయంలో ఆచీ తూచి వ్యవహరించాల్సిన సమంత ఇలా స్వేచ్చగా మెసేజ్ లు పెట్టడం ఏంటా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: