వరుస విజయాలతో దుమ్మురేపుతున్న నాని ఇప్పుడు మరింత క్రేజ్ సంపాదించాడు. సినిమా సినిమాకు తన మార్కెట్ తో పాటుగా అభిమానులను పెంచుకుంటున్న నాని ఈ ఇయర్ కూడా 3 సినిమాలు రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత నాగార్జునతో మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నాడు.


ఇక ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాకు నాని ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడట. ఎం.సి.ఏ సినిమాకు 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నాని పెంచితే ఒకటి, రెండు కాకుండా ఏకంగా డబుల్ రేటు పెంచేశాడు. 


నాని మార్కెట్ కు అంతా పెట్టేయొచ్చు అనిపిస్తుంది.. సేమ్ ఇలానే రెమ్యునరేషన్ కోసం సినిమా కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా రవితేజ కెరియర్ ట్రాక్ తప్పినట్టుగా నాని కూడా ట్రాక్ తప్పుతాడని అంచనా వేస్తున్నారు. అంతేకాదు నాని సినిమా తీయాలనుకునే చిన్న నిర్మాతలకు ఇంత రెమ్యునరేషన్ అంటే కష్టమే అని చెప్పొచ్చు.


చిన్న సినిమాలతోనే ఈ రేంజ్ కు వచ్చిన నాని రెమ్యునరేషన్ విషయంలో మళ్లోసారి తప్పకుండా ఆలోచించాల్సిందే అంటున్నారు. మైత్రి మేకర్స్ కు 10 కోట్లు పర్వాలేదు అనిపించొచ్చు కాని చిన్న బడ్జెట్ నిర్మాతలకు కచ్చితంగా అది పెద్ద లెక్కే. నాని మార్క్ సినిమా అంటే ఇప్పటికే రొటీన్ అయినా తన పఫార్మెన్స్ తో అదరగొడుతున్నాడని చూస్తున్నారు.


ఒకవేళ రెమ్యునరేషన్ కు ఆశపడి అదే రొటీన్ కథలను చేస్తే వరకు నాని కెరియర్ సందిగ్ధంలో పడినట్టే. ఇలానే మాస్ రాజా కెరియర్ కాస్త డిస్ట్రబ్ చేసుకున్నాడని.. చూస్తుంటే నాని కూడా అదే దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: