టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  అంతే కాదు నటుడిగా తనని తాను ప్రూఫ్ చేసుకున్నాడు. అయితే మాస్ ఎలిమెంట్స్ తో పూరి దర్శకత్వంలో ‘లోఫర్’ సినిమాలో నటించాడు..అయితే మాస్ కి కనెక్ట్ అయినా..సినిమా మాత్రం సక్సెస్ కాలేదు.
DVj2KejVMAAxMLz
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘ఫిదా’ తో ఘన విజయం సాధించాడు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.  తాజాగా ఫిదా' సినిమాతో లవర్ బాయ్ గా ఆయనకి మంచి మార్కులు పడిపోయాయి. ఆ తరువాత సినిమా అయిన 'తొలిప్రేమ' ఈ రోజునే భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ చాలా సహజంగా నటించాడని చెబుతున్నారు.

ప్రేమలో పడటం .. మనస్పర్థలతో విడిపోవడం .. మానసిక వేదనను అనుభవించడం .. తిరిగి ప్రియురాలికి దగ్గర కావడం వంటి సందర్భాల్లో ఆయన మంచి పరిణతిని కనబరిచాడని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. 1998లో విడుద‌లై ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ మాట్లాడుతూ.. బాబాయ్ ‘తొలిప్రేమ’ చిత్రానికి ఉన్న పేరును నా సినిమాతో చెడగొట్టను అంటూ ఫ్యాన్స్‌ను మాట ఇచ్చాడు వరుణ్. అన్నట్టే వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, వరుణ్ తేజ్ కి మరో హిట్ పడినట్టేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.      



మరింత సమాచారం తెలుసుకోండి: