సందర్భం ఎలాంటిదైనా సరే తన మాటలతో ఆ అనుభూతిని ప్రేక్షకులుగా మనకు కలిగించేలా చేసిన త్రివిక్రం శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమాకు కాస్త వెనుకడుగేశాడని అన్నారు. లార్గో వించ్ సినిమా కథను యాజిటీజ్ దించేసి అపవాదాలు మోస్తున్నాడు. త్రివిక్రం కెరియర్ స్టార్ట్ అయిన నాటి నుండి ఈనాటి వరకు అతని మీద ఇలాంటి నెగటివ్ కామెంట్స్ రాలేదు.


అయితే సినిమా ఫ్లాప్ వచ్చినా సరే త్రివిక్రం రేంజ్ తెలియచేసేలా తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఉందట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో త్రివిక్రం తన తర్వాత సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్నట్టు తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రం రెమ్యునరేషన్ గా ఓవర్సీస్ రైట్స్ తీసుకుంటున్నారట. అంతేకాదు ప్రాఫిట్స్ లో షేర్ కూడా అంటున్నాడట. 


ఈ లెక్కన చూస్తే ఎన్.టి.ఆర్ సినిమా కాబట్టి ఓవర్ సీస్ లో ఎలా లేదన్నా 15 కోట్లు ఇంకా ప్రాఫిట్స్ అంటున్నాడు కాబట్టి పెట్టిన బడ్జెట్ కు ఎలా లేదన్నా ఎక్కువే అమ్మేస్తారు.. అందుకే అందులో మరో 5 కలుపుకుని ఫైనల్ గా 15+5 మొత్తం 20 కోట్లు ఈ సినిమాకు డిమాండ్ చేస్తున్నాడట త్రివిక్రం. 


టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లో ఒకరైన త్రివిక్రం.. ఎన్.టి.ఆర్ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా మధుబాబు షాడో నవల ఆధారంగా తెరకెక్కుతుందని వార్తలు రాగా స్వయంగా ఆ రచయితే ఈ వార్తలను ఖండించడం విశేషం. అయితే అజ్ఞాతవాస్ మీద లార్గో వించ్ డైరక్టర్ జెరోం సల్లే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: