ఈ మద్య టాలీవుడ్ లో వరుణ్ తేజ్ కి మంచి అదృష్టం కలిసివస్తుంది.  ముకుందా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించాడు.  నటుడిగా కంచెలో అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించిన వరుణ్ తేజ్ ఆ తర్వాత పూరి దర్శకత్వంలో ‘లోఫర్’ సినిమాలో నటించాడు.  ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.  ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 
Tholi prema First Day Collections - Sakshi
ఈ సినిమాలో వరుణ్ తేజ్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచాడు..అంతే కాదు తెలంగాణ యాసతో హీరోయిన్ సాయి పల్లవి కూడా మంచి మార్కులు కొట్టేసింది.  చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఫిదా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ‘తొలిప్రేమ’ విషయానికి వస్తే..  యువతను ఆకట్టుకునే ప్రేమకథ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్‌ తేజ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. సుహాసిని, నరేష్‌, ప్రియదర్శి, హైపర్‌ ఆది ముఖ్యపాత్రలు పోషించారు.

వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచమయ్యాడు. బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇక ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజే క‌లెక్ష‌న్స్ లో వ‌రుణ్ త‌న రికార్డ్ ను తానే బ్రేక్ చేశాడు. 
Image result for fidaa movie
ఆ మద్య  వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేసిన ‘ఫిదా’ వసూళ్లను క్రాస్ చేసి, ఆయన కెరియర్లోనే తొలిరోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే ‘ఫిదా’ తొలిరోజున 8.45 కోట్లను వసూలు చేయగా, తొలిప్రేమ’ 9.5 కోట్లను వసూలు చేసింది. రెండు రోజుల్లోనే తొలి ప్రేమ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ 21 కోట్ల‌ను రాబ‌ట్ట‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: