అర‌వ‌య్యేళ్ల వ‌య‌సులోనూ కుర్రకారు మ‌న‌సు దోచేస్తోంది శ్రీదేవి. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విజ‌యాన్ని అందుకొంది. చిత్ర ప‌రిశ్రమ‌కు కొన్నేళ్లు దూర‌మైనా త‌న‌లో స‌త్తా చావ‌లేద‌ని చాటింది. ఇక‌పై మ‌రిన్ని మెరుపులు మెరిపిస్తాన‌ని చెబుతోంది. నిజంగానే ఇటీవ‌ల ఓ సంస్థకోసం చేసిన ఫొటో షూట్‌లో శ్రీదేవి అద‌ర‌గొట్టింది. ఇంకా ముప్పయ్యేళ్ల అమ్మాయిలానే అందులో క‌నిపించింది.

ఈ అతిలోక సుంద‌రిని ఇక‌పై కూడా ఫుల్ లెంగ్త్ రోల్సే చేస్తానని చెబుతోంది. కొద్దిమంది ప్రత్యేక పాత్రలు చేయ‌మ‌ని అడుగుతున్నార‌ట‌. అందుకు ఆమె ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ఇదే విష‌యంపై ఓ వేడుక‌లో మాట్టాడుతూ... నేను అతిథి పాత్రల‌తో ఎందుకు సరిపెట్టుకోవాలి, ఫుల్ లెంగ్త్ రోల్సే చేస్తాను అని సెల‌విచ్చింది.

బాలీవుడ్‌లో కుర్ర క‌థానాయిక‌ల‌కు కాంపిటీష‌న్ అవుతోంది. అగ్ర క‌థానాయ‌కుల్లో కొద్దిమంది శ్రీదేవితో న‌టించాల‌ని ఉత్సాహ‌ప‌డుతున్నార‌ట‌. త్వర‌లోనే శ్రీదేవి సినిమాలు మ‌రిన్ని తెర‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. మరి ఈ హడావిడిలో తెలుగు వైపు ఒక చూపు చూస్తుందా ఈ సొగసరి?

మరింత సమాచారం తెలుసుకోండి: