అప్పట్లో కామెడీకి పెట్టింది పేరు రాజేంద్రప్రసాద్. నవ్వులు విరగబూయించే  కామెడీ  హీరోగా తనకంటూ ప్రేక్షకుల హృదయాల్లో  ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. హాస్య ప్రధాన సినిమాలు మాత్రమే కాకుండా యాక్షన్ మరియు సెంటిమెంటు సినిమాలలో సైతం హీరోగా నటించి అందరి మన్ననలను పొందాడు. ఉత్తమ నటుడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నాడంటేనే తన నటన ఎలాంటిదో ఉహించుకోవచ్చు. రాను రాను తన మార్కెట్ పడిపోతూవస్తుండటంతో ఇక క్యారెక్టర్ నటుడిగా సినీ కెరీరును కొనసాగిస్తున్నాడు.


అయితే ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రం ఊ.పె.కు.హ. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అనేది దీనికి టాగ్ లైన్. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదలచేసింది. ఇక ఈ ట్రైలర్ ను చూసిన వాళ్లు దీనికంటే బూతు సినిమానే నయం అని అనడం ఖాయం. ఈ ట్రైలర్ లో బూతు తప్ప మరెక్కడా ఏదీ ఉండదు. ఇలాంటి సినిమాలో రాజేంద్రప్రసాద్ నటించడం ఒక ఎత్తు అయితే కూతురి వరస అయ్యే హీరోయిన్ సాక్షి చౌదరి తో ఆయన చేసే రొమాన్స్ ప్రేక్షకులకు చూడాలనిపించడంలేదు.


అహనాపెళ్ళంట, ఆ ఒక్కటీ అడక్కు వంటి క్లీన్ అండ్ నీట్ కామెడీ సినిమాలు, ఆనలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి గుండెకు హత్తుకొనే సినిమాలు చేసిన రాజేంద్రప్రసాద్ ఒక్కసారిగా ఇలాంటి సినిమా ట్రైలర్లో కనిపించడం ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఒక్క సినిమాతో ముందు సంపాదించుకున్న పేరంతా నాశనం అవుతుందని ఆయన అభిమానులే అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: