మొన్నటి వ‌ర‌కూ ప‌వ‌న్‌తో కాలు దువ్విన సూప‌ర్‌స్టార్‌, నేడు ఓట‌మితో భంగ‌ప‌డ్డాడు. టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్‌తో పెట్టుకుంటే ఏం జ‌రిగాలో అలాగే జ‌రిగింది.ప‌వ‌ర్‌స్టార్‌ను ట‌చ్ చేయ‌టం ఎంత ఇబ్బదో ఇప్పుడు తెలిసొచ్చింది. ఇదంతా త‌మిళ్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు, టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మ‌ధ్య జ‌రిగిన పోటీ గురించి చెప్పుకుంటున్న అంద‌రి మాట‌లు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ ఆగ‌ష్టు 9న రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా, ఆ మూవీ పోస్ట్ పోన్ కావ‌డంతో కోళీవుడ్ సూప‌ర్‌స్టార్‌ విజ‌య్ అన్నమూవీకు పోటీ లేకుండా పోయింది. తుపాకీ సక్సెస్‌తో మంచి ఊపు మీద ఉన్న విజ‌య్‌, టాలీవుడ్‌లో త‌న స‌త్తా చూపించ‌టం ఖాయం అనుకున్నాడు. కానీ అన్న మూవీ క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన‌ నాయకుడు మూవీను పోలీ ఉండ‌టంతో, ఈ క‌థ‌ను ఎక్కడో చూసిన ఫీలింగ్‌ను ప్రేక్షకుల‌కు క‌లిగించింది. అందుకే ఇది బాక్సాపీస్ వ‌ద్ద చ‌తికిల బ‌డింది. యూ ట్యూబ్‌లో ప‌వ‌ర్‌స్టార్ అత్తారింటికిదారేది థియోట్రిక‌ల్ ట్రైల‌ర్‌ కంటే  త‌లైవా థియోట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఎక్కువ హిట్లు వ‌చ్చిన‌ప్పటికి, మూవీ రిలీజ్ త‌రువాత క‌నీస క‌లెక్షన్లు కూడ అన్న(త‌లైవా) మూవీ రాబ‌ట్టుకోలేక‌పోయింది.

దీంతో మొద‌టి నుండి ప‌వ‌న్ మూవీకు టార్గెట్‌గా ఉన్న విజ‌య్ అన్న మూవీ ఈ సారి తుస్ మ‌న‌డంతో, టాలీవుడ్‌లో విజ‌య్‌కు మార్కెట్ క్రియోట్ అవ‌డం క‌ష్టమ‌నే అంటున్నారు. క‌నీసం సూర్యా,కార్తిల‌కు ఉన్న మార్కెట్‌లో కొద్దిపాటి మాత్రం కూడ సంపాదించుకోలేక‌పోవ‌డం విజ‌య్‌కు అవ‌మానంగానే నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: