ఆ మద్య మళియాళ నటి భావనపై ఆమె కారు డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. దాంతో భావన వారికి శిక్ష పడే వరకు పోరాటం చేసి ఆ దుర్మార్గులను కటకటాల పాలు చేసింది.  ఇండస్ట్రీలో భావన చూపిన తెగువకు సాటి హీరోయిన్లు ఎంతో మెచ్చుకోవడమే కాదు..ఆమెను స్ఫూర్తిగా తీసుకొని గతంలో తమపై లైంగిక వేధింపుల గురించి సోషల్ మాద్యమాల ద్వారా గోడు విన్నవించుకున్నారు.  ముఖ్యంగా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్లు పైకి రావాలంటే..తమకు శారీరక సుఖం ఇస్తేనే పైకి తీసుకు వస్తామని చెప్పి లొంగ తీసుకుంటున్నారని కొంత మంది హీరోయిన్లు ఫిర్యాదు చేశారు. కాస్టింగ్ కౌచ్... కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు చాలా చోట్ల జరుగుతున్న ఒక చీకటి వ్యవహారం. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఎలా మొదలైంది.
Image result for actress bhavana rape
ఇపుడు పరిశ్రమలో ఉన్న పరిస్థితులు ఏమిటి? అనే వివరాలు వెల్లడిస్తూ ప్రముఖ సినీయర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్ చేశారు. ఒకానొకప్పుడు కొత్త ఆర్టిస్టులు వస్తే మేకప్, కాస్టూమ్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా రకరకాలుగా జరిగిన తార్కాణాలు ఉన్నాయి.  కొంత కాలానికి హీరోయిన్ ని ఎంచుకునే విషయంలో దర్శక, నిర్మాతలే ముందుంటున్నారు. కాస్టింగ్ కౌచ్ అనే దానికి సెకండ్ సైడ్ ఉంది. అప్పట్లో తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈ పిల్లను మీ చేతుల్లో పెడుతున్నాం బాబూ, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనేవారు. ఇష్టం వచ్చింది అంటే ఏం చేస్తారు యాక్టింగ్ చేస్తారనే కదా ఆ పిల్లలు వచ్చింది.
Related image
యాక్ట్ చేయించండి, పని నేర్పించండి అని చెప్పడంలో తప్పులేదు కానీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని ఎలా చెబుతారో అర్థం కాదు.... అని తమ్మారెడ్డి తెలిపారు. పాతతరం హీరోయిన్లు వాళ్ల ఆస్తులు ఏమైపోయాయి, వారు ఏమైపోయారు, వారి తల్లులే ముంచారని ఇప్పటికీ యూట్యూబ్ చూస్తే చాలా మంది హీరోయిన్ల తల్లులు ఏదో చేశారని చెప్పడం కనపడుతూ ఉంటుంది. లేకుంటే అక్కలు, బావలు వారి ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న లేడీసే మోసం చేశారు, ముంచేశారు అని చాలా ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మగ వాళ్లే చేస్తున్నారు అనడం సరికాదు. ఇందులో ఆడవారి భాగస్వామ్యం.
Related image
మొన్న యూట్యూబులో ఓ వీడియో చూశాను. ఓ కుర్రాడు ఎవరో సినిమాలో వేషం వేస్తానంటే లేడీ ప్రొడ్యూసర్ ఏదో అడిగారని విన్నాను. ఇవన్నీ కొంచెం చూడాల్సిన అవసరం మనకు ఉంది. కాస్టింగ్ కౌచ్ అని ఊరికే మనం చెప్పేసి మొత్తం మగవారి మీదే తోసేయం కాదు. ఇప్పుడు లేటెస్టుగా వస్తున్న అమ్మాయిలు కొందరు అవకాశాల కోసం తమకు తాముగా కాస్టింగ్ కౌచ్ ఆఫర్ చేస్తున్నారు.ఎంత సేపూ కాస్టింగ్ కౌచ్ అంటే మగవారే అడుగుతున్నారు అనడం తప్పు.
మీలో టాలెంట్ ఉంటే...
ఆడవారు అడగటం కూడా తప్పు అనేది చెప్పాలి అనేది నా ఉద్దేశ్యం.... అని తమ్మారెడ్డి తెలిపారు.మగవార అడగటం అయినా, ఆడవారు అడగటం అయినా.... రెండూ తప్పే. రెండు చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి. రెండు చేతులు కంట్రోల్ లోకి వెళ్లి వారి ప్రొఫెషన్ ధ్యేయంగా పెట్టుకుని చేయాలనేది నేను కోరుకుంటున్నాను.... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: