గత 6 రోజుల నుండి దేశంలో సరిగ్గా 20 ఏళ్లు కూడా నిండని ఒక అమ్మాయి సంచలనం సృష్టిస్తుంది. అందమైన కళ్ళతో, మయమరిపించేంత నవ్వుతో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఈపాటికి  ఆమె ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమెనే ప్రియ ప్రకాష్. ఎటువంటి డైలాగ్ చెప్పకుండానే కేవలం కన్నుకొట్టి దేశ యువతను కట్టిపడేసింది.


ఆమె దేశం మొత్తం పాపులర్ అవడంతో ఆమెకు సంబందించిన చిన్న విషయం కూడా  తెగ వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఒక ఫోటో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. చిన్నప్పుడు ఏడుస్తూ ఉండగా తీసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఇదే ఫోటో తారసపడుతుంది.


కాగా ఒక్క రాత్రికే స్టార్ అయిన ఈ అమ్మడుకి ఇంస్టాగ్రామ్లో ఫాలోవర్ల సంఖ్య గంటగంటకూ  పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య ముప్పై లక్షల అరవై వేలు. 24 గంటల్లోనే 6 లక్షల ఫాలోవర్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఆమె నటించిన ఒరు అడార్‌ లవ్‌ చిత్రం మార్చి మూడున విడుదల చేయాలని ఆ చిత్రబృందం నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: