టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలో చాలాకాలం విశ్రాంతి తీసుకొని ‘రాజ ది గ్రేట్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టాడు రవితేజ. వచ్చిన విజయంతో వెంటనే టచ్ చేసి చూడు సినిమా ని పూర్తిచేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా ఆశించిన స్థాయిలో విజయం రాలేకపోయింది.


ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణకూరసాల తో సినిమా చేస్తున్నాడు. వరుసగా రెండు విజయాల మీద ఉన్న కళ్యాణ్ కృష్ణ రవితేజతో హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ కొడదమన్న ప్లానింగ్ లో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్ గా సీరియల్ యాడ్ ప్రపంచంలో మంచి క్రేజ్ పాపులారిటీ సంపాదించిన మాళవిక శర్మ రవితేజ పక్కన నటిస్తోంది.


అయితే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా సోషల్ మీడియాలో ఉన్న నెటిజనులకు మాళవిక శర్మ అంటే బాగా తెలుసు. మాళవిక శర్మ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నాయి.


రీసెంట్ గా ఈమె పింక్ టాప్-బ్లూ జీన్స్ వేసుకుని వెనక్కి తిరిగి నిలబడి ఓరగా చూస్తున్న పిక్ చూసి ఫాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో రవితేజతో సినిమా హిట్టు కొట్టిందంటే మాళవిక శర్మ ని ఆపటం ఎవరి తరం కాదంటున్నారు సినిమా విశ్లేషకులు.  



మరింత సమాచారం తెలుసుకోండి: