నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛలో. కన్నడ కిర్రిక్ పార్టీ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్ గా చేసిన ఈ సినిమా మొదటి షో నుండి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కలక్షన్స్ జోరు కొనసాగిస్తున్నాయి. రెండు వారాల్లో ఈ సినిమా మంచి లాభాలతో దూసుకెళ్తుంది.


కేవలం 6 కోట్ల బడ్జెట్, ప్రమోషన్స్ అన్ని కలిపి 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రెండు వారాల్లో 11.5 కోట్ల కలక్షన్స్ సాధించింది. సినిమా తీసిన దర్శక నిర్మాతలకు, కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికి సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పటికి సినిమా స్టడీ కలక్షన్స్ తో వెళ్తుంది. చూస్తుంటే ఫుల్ రన్ లో మరో రెండు కోట్లు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


నాగ శౌర్య కెరియర్ లో ఛలో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. టోటల్ రన్ లో 13 కోట్లు తీసుకురాగా రీమేక్, శాటిలైట్ రైట్స్ తో కలిపి 20 కోట్ల దాకా బిజినెస్ చేశాడని తెలుస్తుంది. కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న సందర్భంలో నాగ శౌర్య సొంతంగా నిర్మించిన ఈ సినిమా తన సత్తా చాటింది. 


సినిమా మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఇచ్చిన మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ రష్మిక కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత నాగ శౌర్య అమ్మగారిల్లు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో షామిలితో నాగ శౌర్య రొమాన్స్ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: