యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో తారక్ కొత్త లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇక సినిమా కథ కథనాల మీద వచ్చిన వార్తలన్నిటినేమి పట్టించుకోకుండా తారక్ ప్రొసీడ్ అవుతున్నారు.


ఇక సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అఆలో కూడా ఆమెనే కంటిన్యూ చేశాడు. ఇక అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బు మంచి పాత్రే చేసింది. కాని ఆ సినిమా ఆడలేదు కాబట్టి ఆమెను రిపీట్ చేసే ఆలోచన లేదట. అయితే త్రివిక్రం ఫైనల్ గా శివగామి రమ్యకృష్ణను డిస్కషన్స్ లో తీసుకురాగా.. ఆమెను వద్దనేశాడట తారక్.


నా అల్లుడు సినిమాలో ఆమెతో ఆడిపాడటమే కాదు ఆమెతో సింహాద్రి సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాడు తారక్. అందుకే రమ్యకృష్ణ మాత్రం వద్దనేశాడట. కుదిరితే మళ్లీ నదియానే ఈ సినిమాలో రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి తారక్ సినిమాలో కూడా ఓ సీనియర్ హీరోయిన్ రోల్ ఉంటుందని తెలుస్తుంది.


ఇక ఈ సినిమాకు స్పెషల్ గా డైరక్టర్ ఫ్లాప్ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఏ డైరక్టర్ అయితే ఎన్.టి.ఆర్ తో తీసే ముందు ఫ్లాప్ కొడతాడో ఆ డైరక్టర్ ఎన్.టి.ఆర్ కు హిట్ ఇస్తాడట. ఆ విధంగా చెప్పుకుంటే ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం కూడా హిట్ అందుకుంటాడని చెప్పొచ్చు. మరి ఈ సెంటిమెంట్ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: