స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్-1 తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వచ్చిన ఈ ప్రోగ్రాం టి.ఆర్.పి రేటింగ్స్ తో దుమ్ముదులిపేసింది. వారం మొత్తం కంటెస్టంట్స్ ఎలా చేసినా వారాంతరంలో వచ్చే ఎన్.టి.ఆర్ ఎపిసోడ్స్ అదరగొట్టాయి.


ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవగా.. సెకండ్ సీజన్ ఈ ఇయర్ జూన్ నుండి స్టార్ట్ అవబోతుంది. ఈ సెకండ్ సీజన్ లో ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయడం కష్టమే అంటున్నారు. అయితే ఈ ఛాన్స్ నాచురల్ స్టార్ నాని అందుకున్నాడని అన్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్-2 హోస్ట్ గా మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యాఖ్యాతగా చేస్తాడట.


అటు ఇటుగా ఎన్.టి.ఆర్ కు పోటీగా బాక్సాఫీస్ పై ఫైట్ చేస్తున్న బన్ని ఇప్పుడు బుల్లితెర మీద కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇప్పటికే రానా కూడా నెంబర్ 1 యారి షోకి యాంకర్ గా చేశాడు. ఎన్.టి.ఆర్ తర్వాత బన్ని స్మాల్ స్క్రీన్ పై తన ప్రెజెన్స్ ఇవ్వనున్నాడు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలియదు.  


బిగ్ బాస్ సీజన్-2 అల్లు అర్జున్ చేస్తే వరకు ఈ షోకి స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. జూన్ లో స్టార్ట్ అయ్యే ఈ షో టైం కు కేవలం బన్ని మాత్రమే ఖాళీగా ఉంటాడు. ఎలాగు తారక్ సినిమాలతో బిజీగా ఉంటాడు కాబట్టి బన్ని బీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: