మామూలుగా అయితే  ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.కానీ కొందరి విషయాల్లో ఇలా జరుగదు.రచ్చ గెలిచాకే ఇంట గెలుస్తారు,అలాంటి కోవకు చెందినదే రకుల్. ఇలా తెలుగులో వరస పెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేస్కుంటూ టాలీవుడ్ లో  హీరోయిన్ గా తనదైన ముద్రవేసింది రకుల్ ప్రీత్ సింగ్ .పట్టిందల్లా బంగారమే అయినట్లు చేస్తున్న ప్రతీ సినిమా రకుల్ కి మంచిపేరు సంపాదించి పెట్టడమే గాక ఆ సినిమాలు నిర్మాతలకు కూడా మంచి లాభాలనేతెచ్చిపెట్టాయి.


2017 వ  సంవత్సరం రకుల్ కు పెద్ద పరాజయాల్ని తెచ్చింది. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో అమ్మడు మకాం ను బాలీవుడ్ కు మార్చేసింది. సాధారణంగా బాలీవుడ్ అనగానే అందాల ఆరబోత తప్పదు. అవకాశాలు రావాలంటే తప్పకుండా స్కిన్ షో చేయాలి. ఇదే ఫార్ములాను వాడి సినిమా ఛాన్సులు కొట్టేయాలని రకుల్ భావిస్తున్నట్లుంది. తాజాగా ఒక మ్యాగజిన్ కు ఇచ్చిన కవర్ ఫోటోల్లో భాగంగా ఎప్పుడూ చూపించనంత అందాలను ప్రేక్షకులకు చూపించింది.


తాజాగా నీరజ్ పాండే దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా ఐయారి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కాగా ఇది ఆమెకు రెండో హిందీ సినిమా. ఈ సినిమా కూడా భారీ డిజాస్టరును మూటగట్టుకుంది. అభిమానులను సంతోషపెట్టడానికో ఏమో కానీ ఈ సారి మాత్రం మాక్సిం మ్యాగజైన్ కోసం చేసిన సెక్సీ ఫోటోషూట్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ ను చేసింది. కాగా అభిమానులు సినిమా పోతే పోయింది నీ అందం ముందు ఇంకెవరు సాటికారు అని వీడియో ను తెగ షేర్ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: