బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ మ‌రోసారి అర్జిత్ సింగ్ పాడిన పాట‌ను సినిమా నుంచి తొల‌గించాడు. దిల్జీత్ దోసాంజ్, సోనాక్షి సిన్హా  న‌టించిన చిత్రం వెల్‌క‌మ్‌టూ న్యూయర్క్ చిత్రంలో అర్జిత్‌సింగ్‌ను పాడిన పాట‌ను స‌ల్మాన్ ఖాన్ తొలగించాడు.  2016లో జ‌రిగిన  ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌లో స‌ల్మాన్ ఖాన్‌ను అర్జిత్  సింగ్ అవ‌మానించాడు. ఆ కోపంతోనే స‌ల్మాన్ ఖాన్ త‌ను న‌టించిన సుల్తాన్ చిత్రంలో జ‌గ్ గూమేయ పాట పాడిన అర్జిత్‌సింగ్ పాట‌ని తీసేసి అదే పాట‌ని మరో గాయ‌కుడు ర‌హ‌త్ పతే అలీఖాన్ తో పాడించాడు.
salman khan Arijit Singh Welcome to New York song
ఈ విష‌యం తెలుసుకున్న అర్జిత్ సింగ్ ఫేస్‌బుక్ వేదికగా త‌న జీవితంలో మీ కోసం ఓ పాట పాడాన‌ని చెప్పుకోవడానికైనా  పాట‌ను తొల‌గించ‌వ‌ద్దంటూ స‌ల్మాన్ ఖాన్‌కు క్ష‌మాప‌ణ‌లు కోరినా ఫ‌లితం లేక‌పోయింది.  ఓ విలేక‌రి ఈ క్ష‌మాప‌ణ విష‌య‌మై స‌ల్మాన్  ఖాన్‌ను ప్ర‌శ్నించ‌గా.. చిత్రంలో ఉండాల లేదా అనే విష‌యం  ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడిపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని  చెప్పారు. 
Image result for singer arijit singh salman khan
త్వ‌ర‌లో విడుద‌ల కానున్న వెల్‌క‌మ్ టు న్యూయార్క్ చిత్ర‌లో స‌ల్మాన్ ఓ పాట‌లో త‌ళుక్కున మెర‌వ‌నున్నాడు స‌ల్మాన్ క‌న‌బ‌డనున్న అదే  పాట‌ను  అర్జిత్ సింగ్ పాడ‌టంతో స‌ల్మాన్ ఖాన్ వేరే గాయ‌కుడితో ఆ పాట పాడించ‌మ‌న్నాడ‌ని, అర్జిత్ సింగ్ పాట‌ను ఉంచ‌డానికి వీల్లేద‌ని అలాగైతే త‌ను  గెస్ట్ ఎప్పీయ‌రెన్స్  ఇవ్వ‌న‌ని చిత్రం యూనిట్ ఖ‌రాఖండీ చెప్పాడ‌ని వినికిడి. ఈ పాట తొల‌గింపు విష‌య‌మై  ఇంత‌కు వర‌కు చిత్ర యూనిట్ గాని నిర్మాతలు గాని స్పందించ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: