హీరోయిన్ గా ఎదగాలి అంటే హోంలీ పాత్రలే చేస్త అంటే కుదరదు. పక్కాగా చెప్పాలంటే మడి కట్టుకు కూర్చుంటే ఇక్కడ అవకాశాలు తక్కువే వస్తాయి. గ్లామర్ డాల్ గా ప్రేక్షకుల మనసు దోచేస్తేగాని స్టార్ ఇమేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక తెలుగులో అందం, అభినయం రెండిటికి ప్రాధాన్యత ఉంటుంది.


కేవలం అభినయం చూపి ప్రేక్షకుల మనసులు గెలుచుకునే వారు కొందరైతే అందంతో ఆరాధించపడే వారు మరికొందరు. అయితే ఇదవరకు తెలుగులో రెండు సినిమాలు తీసి అంతగా పాపులర్ కాని అమ్మడు ఒక్క బికిని లుక్ తో షేక్ చేసింది. ఆమె ఎవరో ఈపాటికే అర్ధం అయ్యుంటుంది. అవును ఆ అమ్మడు ఎవరో కాదు డిజే భామ పూజా హెగ్దె.


ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించినా రాని క్రేజ్ స్టైలిష్ స్టార్ సినిమాలో టూ పీస్ బికిని వేసింది అంతే.. అమ్మడి రేంజ్ పెరిగిపోయింది. అంతకుముందు మొహెంజోదారో చేసినా కూడా ఈ మాత్రం క్రేజ్ తెచ్చుకోలేదు. ప్రస్తుతం అమ్మడి సినిమాల లిస్ట్ చూస్తే అందరు షాక్ అవుతున్నారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న పూజా.. మహేష్ 25వ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.


ఇక ఇవే కాకుండా శ్రీనివాస కళ్యాణం సినిమాలో నితిన్, ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాలో కూడా ఈ అమ్మడిని తీసుకునే ఛాన్స్ ఉందట. మొత్తానికి బికిని వల్ల ఆమెకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. డిజే హిట్ లో అమ్మడి పాత్ర గురించి తెలుసుకుని దర్శక నిర్మాతలు పూజాని ఫుల్ గా వాడేద్దామనుకుని ఫిక్స్ అయ్యారనుకుంటా.. అందుకే ఆమె కోసం క్యూ కడుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: