అయ్యో నేను చాలా లావుగా ఉన్నా. నన్ను అందరూ అపహేళన చేస్తూ ఉంటారు. నాకు ఈ బట్టలు అస్సలు సరిపోవు. నేను ఉన్న లావుకీ ఈ బట్టలు వేసుకుంటే చుట్టూ ఉన్న ప్రజలు నన్ను చూసి ఏమనుకుంటారో ఏమో! లావుగా ఉన్న వాళ్ళు ఈ బట్టలు అస్సలు వేసుకోకూడదు. నా శరీరాకృతికి ఇలాంటి బట్టలు అస్సలు సూట్ అవవు. ఇలా ఎన్నో ఎన్నెన్నో చాలానే ఊహించుకుంటారు కొంతమంది. 


మనకు నచ్చింది చేయాలి, మనకి ఇష్టమైన బట్టలు వేసుకోవాలి అంటూ హాట్ గా ఒక సందేశాన్ని ఇచ్చింది బాలీవుడ్ బుల్లితెర నటి కవిత కౌశిక్. బికినీలు ధరించడానికి, స్విమ్ సూట్లు వేసుకోవడానికి మహిళలు మొహమాటపడకండి, మీకు ఏవి సౌలభ్యం అనిపిస్తే అవే ధరించండంటూ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈమె ఆడవాళ్లకు పిలుపునిచ్చింది.


తాజాగా ఆమె బికినీలో ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె గోవాలోని ఒక బీచ్లో తన భర్తతో కలిసి హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఒక అందమైన బీచ్లో ఆరంజ్ కలర్ బికినీలో హోయలొగుతూ ఫోటోలకు ఫోజిచ్చింది. ఆమె తెలుగువారికి కూడా సుపరిచితమే. అది ఎలాగంటే తెలుగులో అనువాదమైన అయిన ‘ఎఫ్ఐఆర్’ అనే సీరియల్లో ఈమె ప్రధాన పాత్రను పోషించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: