ఎన్టీఆర్‌కి వాడకం అంటే ఏంటో చూపిస్తున్నాడు ఆ హీరో. ఇప్పటి వ‌ర‌కు స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు పేరును ఆ కుటుంబ స‌భ్యులు, మ‌న‌వ‌ళ్ళు విప‌రీతంగా వాడుకున్నారు. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అయితే తాత గారి పేరును ఉప‌యోగించుకోవ‌డంలో ముందు వరుస‌లో ఉంటాడు. ఇప్పుడు ఈ వాడకం రాష్ట్ర స‌రిహ‌ద్ధులు దాటి వెళ్ళింది. త‌మిళ్ హీరో విశాల్ అప్‌క‌మింగ్ మూవీ టైటిల్ కోసం ఎన్టీఆర్ అని ఫిక్స్ చేశాడు. త‌మిళ్‌లో రూపొందుతున్న ఈ మూవీకు అక్కడ ఎం.జి.ఆర్ అని పెట్టాడు. ఆ విధంగా అక్కడా ఇక్కడా పేరున్న ప‌ర్సనాలిటీల‌ను పెట్టుకొని ఎలాగొలాగా హిట్ కొట్టాల‌నే తాప‌త్రయంలో ఉన్నాడు విశాల్‌.

త‌మిళ్‌లో రూపొందుతున్న ఈ మ‌ద గ‌జ రాజ(MGR) అనే మూవీలో అంజ‌లి,వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. తెలుగులో వ‌స్తున్న ఈ మూవీతో వ‌ర‌లక్ష్మి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతుంది. వ‌ర‌ల‌క్ష్మి టాలీవుడ్ వైపు చూస్తుంద‌ని కోళీవుడ్‌లో వినిపిస్తున్న మాట‌. త్వర‌లోనే ఓ టాలీవుడ్‌లోని ఓ టాప్ హీరోతో వ‌ర‌ల‌క్ష్మి జోడిక‌ట్టేందుకు సిద్ధంగా ఉందంటుంది టాలీవుడ్‌. అయితే ఆ హీరో ఎవ‌ర‌న్నది ఇంకా తెలియాల్సిన విష‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి: