భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ వైవాహిక జీవితంలో రక రకాలుగా సాగింది. మొదట ఓ వివాహం చేసుకున్నా తర్వాత తన సహనటి సారికతో పెళ్లైంది. వారికి శ్రుతిహాసన్, అక్షర హాసన్ లు జన్మించారు.  ఆ తర్వాత సారికతో బంధాలు తెంచుకొని తన సహనటి అయిన గౌతమితో చాలా కాలం సహజీవనం చేశారు.  కమల్ హాసన్ తో 13 ఏళ్లు కలిసి సహజీవనం చేసిన గౌతమి గత సంవత్సరం ఆయనతో తెగదెంపులు చేసుకుంది. 
ఆమె కోసం నా జీవితం
తాజాగా విశ్వనటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై ఆయన మాజీ ప్రియురాలు, బహుబాష నటి గౌతమి ఆరోపణలు గుప్పించారు. కమల్ హాసన్ తో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని, మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి తన మద్దతు లేదని గౌతమి స్పష్టం చేశారు. ప్రస్తుతం తన కుమార్తె సుబ్బలక్ష్మి భవిష్యత్తు మీద తాను ఎక్కువ దృష్టి పెట్టానని, ఆమెను ఆర్థికంగా స్థిరపరిచిన తరువాత మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తానని, అంత వరకూ ఇతరుల గురించి ఆలోచించే సమయం తనకు లేదని గౌతమి వివరణ ఇచ్చారు.
ఆధారాలు ఉన్నాయి
అంతే కాదు కమల్ హాసన్ హీరోగా చేసిన కొన్ని చిత్రాలకు తాను స్టైలింగ్ చేశానని.. కానీ వాటికి అతడి నిర్మాణ సంస్థ పారితోషికం ఇవ్వలేదని సినీ నటి గౌతమి మంగళవారం ఆరోపణలు చేసింది. దీనిని ఖండిస్తూ కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. తమ సంస్థ నుంచి గౌతమికి ఒక్క రూపాయి కూడా బాకీ లేమని వారు తెలిపారు.
శృతి హాసన్ కారణం !
అయితే కమల్ హాసన్ సినిమాలకు కాస్టుమ్ డిజైనర్ గా పని చేసిన తనకు ఇంకా పారితోషికం ఇవ్వలేదని, మోసం చేశారని, ఆ విషయంలో శృతి హాసన్ కు ఎలాంటి సంబంధం లేదని గౌతమి అన్నారు. అయితే గౌతమి పారితోషికం విషయం రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ చూసుకుంటుందని హీరో కమల్ హాసన్ అంటున్నారు.కమల్ చిత్రాలైన 'దశావతారం' నిర్మించింది ఆస్కార్ సంస్థ అని, అలాగే 'విశ్వరూపం'ను నిర్మించింది పీవీపీ సంస్థ అని.. ఆ సినిమాలకు పనిచేసిన గౌతమికి పారితోషికం ఇవ్వాల్సింది ఆ రెండు సంస్థలని.. దీనికి, రాజ్‌కమల్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తమ కంపెనీ నుంచి గౌతమికి ఎలాంటి బాకీ లేదని, ఒకవేళ ఆమె ఆధారాలు చూపితే పారితోషికాన్ని చెల్లించేందుకు సిద్ధం అని వారు ఓ ప్రకటనను విడుదల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: