ఫస్ట్ మూవీతోనే సక్సెస్ ను తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు దిల్ రాజు. కొంతకాలంగా దిల్ రాజు పట్టిందల్లా బంగారమవుతోంది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న దిల్ రాజు.. ఇప్పుడు సౌతిండియా కింగ్ గా మారేందుకు స్కెచ్ వేశాడు.

Image result for dil raju

టాలీవుడ్ లో ఇప్పటికే 6 వరుస హిట్స్ తో పండగ చేసుకుంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు టోటల్ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెంచాడు. తెలుగు, తమిళ్ హీరోస్ తో ఓ మల్టిస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే మొన్న కమల్ హాసన్ తో శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 అనే భారీ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశాడు. కానీ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మరో బడా దర్శకుడిపై కన్నేశాడు దిల్ రాజు. ప్రజెంట్ ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మణిరత్నం దర్శకత్వంలో ఓ మెగా మూవీ ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. ఈ మూవీతో టోటల్ సౌత్ లో పాపులర్ అవ్వాలనేది దిల్ రాజు ప్లాన్. ఇదొక మల్టీస్టారర్ మూవీగా తెలుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన యంగ్ హీరోస్ ఈ సినిమాలో నటిస్తారని టాక్.

Image result for maniratnam

ఈ సినిమాలో మెగా హీరోల్లో ఒకర్ని తీసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం. ఒప్పుకుంటే చరణ్, లేదంటే వరుణ్ ను తీసుకోవాలనేది ఈ నిర్మాత ఆలోచనట. కోలీవుడ్ నుంచి హీరోగా ఎవర్ని తీసుకుంటారనేది మణిరత్నం నిర్ణయానికే వదిలేసినట్టు తెలుస్తోంది. గతంలో మణిరత్నం చెర్రీతో ఓ సినిమా చేయడానికి గట్టి ప్రయత్నలే చేసాడు. కానీ అది కాస్తా చర్చల దశలోనే ఆగిపోయింది. దీంతో మెగా కాంపౌండ్ లో ఒక స్టోరీని ఓకే చేయించుకోవాలంటే ఎన్ని దశలు దాటాలో మణిరత్నంకు తెలిసొచ్చింది. అందుకే ఈ ప్రాజెక్టుపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కథల విషయంలో చరణ్ మైండ్ సెట్ మారడంతో ఈసారి ఓకే అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దిల్ రాజు నిర్మాత కాబట్టి మెగా టీంని కన్విన్స్ చేయడం చాలా ఈజీ అనే టాక్ వినిపిస్తోంది.

Image result for ram charan and varun tej

అయితే... దిల్ రాజు, మణిరత్నం కాంబినేషన్ పైనే అనుమానాలున్నాయి. కథ ఎలాంటిదైనా అందులో దిల్ రాజు ప్రమేయం ఉండాల్సిందే. ఊరికే వేలు పెడుతున్నాడనే విమర్శలు ఉన్నప్పటికీ తన ప్రాజెక్టును అలా దగ్గరుండి చూసుకోవడం దిల్ రాజుకు ఇష్టం. శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు డ్రాప్ అవ్వడానికి కూడా ఇదే కారణం. మరి మణిరత్నం లాంటి దర్శకుడు ఇందుకు ఒప్పుకుంటాడా అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే.!


మరింత సమాచారం తెలుసుకోండి: