సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ కు వద్దన్నా సరే క్రేజీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో పెళ్లిచూపులు తర్వాత తరుణ్ భాస్కర్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టుగా వార్తలు వస్తుండగా ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా ఆమెను హీరోయిన్ గా సంప్రదించారట.


టాలీవుడ్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కరణ్ జోహార్ హింది రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. రోహిత్ శెట్టి డైరక్షన్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని పెట్టుకోవాలా అని చూస్తున్నారు.  


ఇక ఛాన్స్ ఎంచక్కా ప్రియా ముంగిట వాలిందట. ఒరు ఆదార్ లవ్ లోని ఒక్క సాంగ్ టీజర్ తోనే సంచలనం సృష్టించిన ఈ అమ్మడు టెంపర్ రీమేక్ లో కరెక్ట్ అనుకుని కరణ్ ఆమెతో సంప్రదింపులు చేశారట. అయితే ఒరు ఆదార్ లవ్ సినిమా రిలీజ్ అయ్యే దాకా ఏ సినిమాకు కమిట్ అవకూడదని కండీషన్ పెట్టారట. 


అందుకే వచ్చిన క్రేజీ ఆఫర్లను సైతం ప్రియా పక్కన పెట్టేస్తుంది. ప్రియా క్రేజ్ తో ఒరు ఆదార్ లవ్ మలయాళ సినిమా అయినా తెలుగు భాషలో డబ్ చేసి మరి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంతేకాదు ఆమెకి ఉన్న క్రేజ్ తో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: