సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నపుడు హీరోలు, హీరోయిన్ల మద్య కొన్ని ఇగో ప్రాబ్లామ్స్ ఉంటాయని తెలుసు.  బయట మాత్రం మా మద్య ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేవంటూనే..కొన్ని సార్లు వాళ్ల నిజస్వరూపాన్ని బయట పెడుతుంటారు.  ఇలాంటిది సినిమాలోనే కాదు అన్నింటా ఉంటాయి.  ముఖ్యంగా సినిమాల్లో మాత్రం ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా మంచి స్థాయికి వెళ్తున్న హీరో, హీరోయిన్లను ఎదగకుండా చేస్తుంటారని వార్తల్లో చదువుతూనే ఉన్నాం. 
Image result for sridevi jayasudha
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 80వ దశకంలో స్టార్ హీరోయిన్లుగా చలామణి అయిన వాళ్లలో శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి వారు ఉన్నారు.  తెలుగు అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణలతోనే కాకుండా ఎంతో మంది హీరోలతో నటించారు.  అప్పట్లో హీరోయిన్ల మద్య కొన్ని ఇగో ప్రాబ్లామ్స్ బాగా ఉండేవని రూమర్లు వచ్చేవి.
Image result for sridevi jayasudha
తాజాగా ఓ య్యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన జయసుధ కొన్ని సంచలన విషయాలు తెలిపారు. శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు .. వాళ్ల కుటుంబసభ్యులు కూడా నాకు బాగా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవి చాలా స్వీట్ పర్సన్. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో చేశాము. ఆమెకి, నాకు మధ్య ఎలాంటి 'ఇగో' ప్రోబ్లమ్స్ ఉండేవి కావు. 

కానీ ఇండస్ట్రీలో కొంత మంది మేమంటే గిట్టని వారు..మా మద్య కొన్ని ఇగో ఫీలింగ్స్ ఉన్నాయని ప్రచారం చేశారు. అలాంటివాళ్ల మాటలు మనసులో పెట్టుకుని నేను ఎవరినీ దూరం చేసుకోను. ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే నేరుగా అడిగేస్తానే కానీ .. మాట్లాడటం మానేయను. శ్రీదేవికి ..నాకు మధ్య మంచి సంబంధాలు వున్నాయి" అంటూ చెప్పుకొచ్చారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: