నాని హీరోగా 2014 లో వచ్చిన ఆహా కళ్యాణం అనే సినిమా గుర్తుందా! ఆ సినిమాలో నటించిన హీరోయినే వాణీ కపూర్. బాలీవుడ్లో విడుదలయిన సినిమా శుధ్ దేశీ రొమాన్స్ తో వెండితెరకు పరిచయమయింది. హిందీలో నిర్మించిన బ్యాండ్ బాజా బారాత్ సినిమా ను  తెలుగు, తమిళ భాషల్లో ఆహా కళ్యాణం అనే పేరుతో రీమేక్ చేయడంతో ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.


కెరీర్ మొదట్లో గ్లామరస్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు ఈ అమ్మడు. అయితే గ్లామరస్ ఫీల్డులో అందాలు ఆరబోయకపోతే ఛాన్సులు దక్కవని తెలుసుకుందేమోగాని తరువాత నటించిన ప్రతీ సినిమాలో అందాలను ఆరబోసింది. అందరు కథానాయికల మాదిరే ఈ భామ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. జీవితంలో ప్రతీ చిన్న మొమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.


తాజాగా ఆమె పెట్టిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మాక్సిమ్ మ్యాగజైన్ కోసం మొన్న రకుల్ బికినిలో రచ్చలేపింది గదా ఈ అమ్మడు కూడా అదే మ్యాగజైన్ కోసం బికినీ ధరించి ఫోజులిచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని తన ఇంస్టాగ్రమ్ పేజిలో షేర్ చేసింది. ఇక కుర్రకారు ఊరుకుంటారా వాటిని లైకులు, కామెంట్లతో తెగ షేర్ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: