టాలీవుడ్ లో మెగా హీరోతో ఓ సినిమా సెట్ అవ్వాలంటే కథ నుంచి కటౌట్ వరకు అన్నీ కత్తిలా ఉండాలి. దానికి తగ్గట్టే అవుట్ పుట్ ఓ రేంజ్ ఇచ్చే డైరెక్టర్ గా స్టెంప్ పడాలి. ప్రజెంట్ ఇలాంటి క్వాలిటీస్ తోనే చెర్రీని బుట్టలో పడేసాడు సుకుమార్. ఒక వైపు రంగస్థలాన్ని రిలీజ్ కి రెడీ చేస్తునే .. మరో సినిమా ఆఫర్ పట్టేసాడు. త్వరలో కొణిదల ప్రోడక్షన్ లో మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఇంతకీ రంగస్థలం రిలీజ్ అవ్వకుండానే చెర్రీ మరో ఆఫర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి?

 Image result for chiranjeevi and sukumar

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం. ఇప్పటికే టీజర్ పేలింది. సాంగ్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాయ్. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ కోసం ఎన్టీఆర్ తో కలిసి లాస్ ఏంజెలెస్ కి చెక్కేసాడు రామ్ చరణ్. ఆ తర్వాత రంగస్థలం ప్రోమోషన్లపై దృష్టి పెట్టబోతున్నాడు.

 Image result for chiranjeevi and sukumar

ప్రజెంట్ మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రంగస్థలం అవుట్ పుట్ ఒక రేంజ్ లో నచ్చేయడంతో.. సుక్కుకు తన ప్రొడక్షన్ బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ తరపున మరో సినిమా చెసే అవకాశం ఇచ్చాడట చరణ్. దీనిలో భాగంగానే కొణిదెల బ్యానర్ నుంచి కొంత మొత్తం అడ్వాన్స్  సుకుమార్  చేతికి అందినట్టు టాక్. అయితే ప్రజెంట్ తనకున్న కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాని అప్పుడే స్టార్ట్ చేయ్యలేనని చెర్రీకి క్లారిటీ ఇచ్చాడట సుకుమార్. దీనికి చెర్రి కూడా ఓకే చెప్పడంతో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో మరొక సినిమా చేసే ఛాన్స్ రావడంతో  చాలా సంతోషంగా ఉన్నాడు సుకుమార్. అన్నీ బాగా కుదిరితే సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవితో ఓ సినిమా చేయించడానికి రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడని ఇంటర్నల్ సమాచారం.

 Image result for chiranjeevi and sukumar

 మొత్తానికి రంగస్థలం అనే సింగిల్ సినిమాతో మెగా కాపౌండ్ లో అడుగు పెట్టిన సుకుమార్ కి లక్ కలిసొచ్చింది. అందుకే రంగస్థలం రిలీజ్ కాకుండానే మరో మెగా ఆఫర్ తన ఎకౌంట్ లో పడింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది మాత్రం రంగస్థలం రిజల్ట్ పై అధారపడి ఉంటుంది. మార్చి 30న వస్తున్న ఈ సినిమా బాక్సాపీస్ ని షేక్ చేస్తే.. సుకుమార్ సీన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అదే కొణిదల ప్రొడక్షన్ హౌస్ లో చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ తీసుకురాబోతుంది. మరి చూద్దాం.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: