బాలీవుడ్ బ్యూటీ  దీపికా పదుకొణె ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్లో ఉంది.  హిస్టారికల్ చిత్రాల్లో నటించి దీపికా..బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా నటించింది.  విజయ్ మాల్యా కింగ్ ఫిషర్స్ క్యాలెండర్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన దీపికా తర్వాత ఓం శాంతి ఓం లో నటించి ప్రస్తుతం నెంబర్ వన్ పొజీషన్ లోకి వచ్చింది. ఈ మద్య సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో   దీపికా పదుకొణె నటించి ‘పద్మావత్’ ఎన్నో వివాదాల నడుమ రిలీజ్ అయ్యింది. 
Image result for deepika padukone
మొదట ఈ సినిమా కర్ణిసేన అభ్యంతరం తెలిపినా తర్వాత సినిమా పై ప్రశంసల జల్లు కురిపించారు.  ప్రస్తుతం  దీపికా పదుకొణె తీవ్ర అనారోగ్యానికి గురైందని వార్తలు గుప్పుమంటున్నాయి.  ‘పద్మావత్‌’ సినిమా షూటింగ్‌ సమయంలోనే తీవ్రమైన నడుం,  మెడ నొప్పితో దీపికా బాధపడింది. దీంతో వైద్యులను సంప్రదించింది. దీపికా పదుకొణె పరీక్షించిన వైద్యులు ఆమెకు విటమిన్ 3డీ ఉందని ఆమెకు సాధ్యమైంత వరకు రెస్టు తో పాటు వైద్యం కూడా అందాల్సి ఉందని తేల్చి చెప్పారు. 
Related image
కొంత కాలం ఫిజియోధెరపీ చేయించుకోవాలని సూచించారు. దీంతో దీపిక విశ్రాంతి, చికిత్స తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విశాల్ భరద్వాజ్ రూపొందించే సినిమా ఆలస్యమవుతోందని బాలీవుడ్ సమాచారం. విశ్రాంతి తీసుకుంటూనే దీపిక కొత్త కథలను వింటోందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: