నాగ చైత‌న్య‌- చందూ మొండేటి కాంబినేష‌న్‌లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌వ్య‌సాచి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో చైతూ సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న వెనుక చేతులు డిఫ‌రెంట్ టాటూస్‌తో కనిపిస్తున్నాయి.
Image result for naga chaitanya chandu mondeti
రెండు చేతుల్ని సమర్థంగా.. శక్తివంతంగా వాడేవాళ్లనే సవ్యసాచి అంటారు. అదే టైటిల్‌ను నాగ చైతన్య కొత్త చిత్రానికి ఫిక్స్‌ చేయగా.. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్లు విడుదల చేశారు. మహాభారతంలో అర్జునుడి అయిదో పేరు సవ్యసాచి. ఎందుకంటే అర్జునుడు రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్య ప్రదర్శించగలడు.
Image result for naga chaitanya chandu mondeti
అలాగే ఈ చిత్రంలో హీరో రెండు చేతులను సమర్థవంతంగా వాడి పరిస్థితులను, ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు అంటూ ఓ సందేశంతో పోస్టర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. నాగచైతన్యకి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మాధవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నాగచైతన్య సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: