టాలీవుడ్ ఇండస్ట్రీలో సాంప్రదాయమైన పాత్రలు వేస్తూ..ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు నటి శ్రీవిద్య.   1966 నుంచి 2000 సంవత్సరం వరకూ ప్రముఖ నటిగా రాణించిన శ్రీవిద్య తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో పలు భాషల్లో నటించారు. తాజాగా  నటి శ్రీవిద్య ఇంటిని ఆదాయ పన్ను శాఖ వేలం వేయనుంది.
Image result for srividya
ఈనెల 27న ఇంటిని వేలం వేయనున్నట్టు ప్రకటించిన అధికారులు ఇంటి ధరను రూ.1,17,20,000గా నిర్ణయించింది.  చెన్నైఅభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో శ్రీవిద్యకు రెండస్తుల ప్లాట్ ఉంది. ప్రస్తుతం ఇందులో డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ ఇంటికి చాలా కాలంగా పన్ను చెల్లించకపోవడంతో డ్యాన్స్ స్కూల్ ద్వారా వస్తున్న  ఆదాయపన్ను శాఖ జమచేసుకుంటోంది.
Related image
అయితే ఇంటి పన్ను, వడ్డీ విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ఇంటిని వేలం వేయాలని నిర్ణయించారు.  శ్రీవిద్య కేన్సర్‌ వ్యాధితో 2006లో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో మరణించారు. అయితే ఆమెను చివరి దశలో మలయాళ నటుడు, ఆ రాష్ట్ర శాసన సభ్యుడు గణేశ్‌కుమార్‌ బాగోగులు చూసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: