భారత దేశం లో బాహుబాషల్లో నటించిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు.  ఇక  రజినీకాంత్ కి సౌత్ లో ఎంతగా క్రేజ్ ఉందొ వేరే చెప్పక్కర్లేదు. రజినీకాంత్ సినిమాలు వస్తున్నాయి అంటే సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి.  సూపర్ స్టార్ రజినీకాంత్ కి హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంటుంది.

అందుకే రంజిత్ పా తో తీసిన ‘కబాలి’ సినిమా అట్టర్ ప్లాప్ అయినా.. మళ్ళీ రంజిత్ పా తో కలిసి ధనుష్ నిర్మాణంలో చేసిన కాలా సినిమాపై విపరీతమైన క్రేజ్ ట్రేడ్ వర్గాల్లోనూ.. ప్రేక్షకుల్లోనూ ఉంది. ప్రస్తుతం కాలా కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు.  గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ను శాసించే సూపర్ స్టార్ రజినికాంత్ సంచలనాలు మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.  తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్మకాన్ని రాగా దాదాపు 75 కోట్లకు స్టార్ టీవీ వాళ్ళు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.
Image result for కాలా శాటిలైట్ హక్కులు
ఈ మొత్తానికి హిందీ, తమిళం, తెలుగు వెర్షన్స్ ల హక్కులు వచ్చాయి. అటు థియేట్రికల్ హక్కులను లైకా వారు 125 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి ఇదివరకే తెలిసిందే. ఈ సినిమాలో రజిని, ముంబైలోని కార్మికవాడల నాయకుడిగా, పొలిటికల్ రంగులను పులుముకుని కరికాలుడు పాత్రలో మెరవనున్నారు.

త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసి..ప్రమోషన్స్ ను విరివిగా చేయనున్నారు. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో హ్యూమా ఖురేషి, నానా ప‌టేక‌ర్ లు కీల‌క‌పాత్ర‌ల‌లో న‌టించారు.. ర‌జ‌నీ అల్లుడు ద‌నుష్ ఈ మూవీకి నిర్మాత‌.


మరింత సమాచారం తెలుసుకోండి: