రంగ స్థలం వేడుకలో చిరంజీవి అవార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినాడు. ఈ వేడుకలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి.. చిత్రబృందంలోని ముఖ్యమైన పాత్రల గురించి మాట్లాడారు. ” ఈ సినిమా అన్ని విధాలుగా, అన్ని కోణాల్లోంచి కూడా అత్యద్భుతం అనిపించుకుంటుంది. రాబోయే రోజుల్లో అభిమానుల చేత శభాష్ అనిపించుకోవడమే కాకుండా.. అవార్డుల కోసమే సినిమాలు తీయరు.. కానీ ఈ సినిమా మాత్రం అవార్డులు సొంతం చేసుకుంటుంది. చిత్రంలోని అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు అవార్డులు వస్తాయి. 
Image result for chiranjivi
జాతీయస్థాయిలో ఈ సినిమాలు అవార్డు వస్తుందన్నా ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అవార్డులు రావాలి.. రాక పోతే సినిమాకు అన్యాయం జరిగినట్లే. ఈ ఏడాది ఈ సినిమా అత్యద్భుతమైంది కావాలని.. అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని చివరగా చిత్రబృందానికి, మిగతా యూనిట్ సభ్యులకు  ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ చిరు తన ప్రసంగాన్ని ముగించారు.
Image result for chiranjivi
రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “రంగస్థలం మిమ్మల్ని అలరిస్తుంది. ఇది అభిమానుల ఆశీస్సులతోటి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాకు ఖైదీ నెం 150 లాగా చరణ్‌కు రంగస్థలం కూడా అలాంటి సినిమానే. రాంచరణ్‌కు స్టార్ స్టేటస్‌‌ పెంచే.. చరణ్ నటుడిగా మరో మెట్టు ఎదిగే  సినిమా అవుతుంది. ఇదే మాట వక్తలందరూ చెప్పారు ఇది సత్యం. డైరెక్టర్ సుకుమార్ ఈ అవకాశం చరణ్‌కు.. ఇవ్వడం ఆర్టిస్టుగా ఈర్ష్య పడుతున్నాను.. తండ్రిగా గర్వపడుతున్నాను. అని చిరంజీవి చెప్పినాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: