నంద మూరి ఫ్యామిలీ అంత కలిసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని, అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు చాలా మంది డైరెక్టర్స్ ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు. మనం లాంటి స్టొరీ దొరకలేదో, లేక నంద మూరి ఫ్యామిలీలో  విభేదాలో అర్ధం కావడం లేదు. పవన్ సాధినేని అనే డైరక్టర్ ఇప్పుడు ఇలాగే తన కథ పట్టుకుని కూర్చున్నారు.
Image result for nanda muri family
మనం సినిమా టైపులో, ఆయనో కథ  రాసుకున్నారు. అందులో హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ చేస్తే బాగుంటుదని అనుకున్నారు. కళ్యాణ్ రామ్ ను కలిసారు. బాగానే వుందని, కథలో మార్పులు చేర్పులు చేయించారు. ఎన్టీఆర్ చేసేంత పాత్ర కాదు, సరే కామియోగా కనిపించే వీలుంటే పరిశీలిద్దాం అనుకున్నారు. హరికృష్ణ, కళ్యాణ్ రామ్ చేస్తారో అనుకుంటే మళ్లీ మరో చిక్కొచ్చింది. హరికృష్ణకు వయసు బాగామీద పడింది. ఇప్పుడు ఆయన చేసినా సినిమాకు అంత బజ్ రాదు. పైగా చేయలేరేమో కూడా. అందుకే ఆ పాత్రకు బాలకృష్ణ అయితే బాగుంటుందేమో? అన్న ఆలోచన చేసారు.
Image result for nanda muri family
కానీ వెళ్లి అడగాలి. కథ వినిపించాలి. బాలయ్య మూడ్ బాగుంటే ఓకె అంటారు. లేదు అంటే నో అంటారు. మొన్నటికి మొన్న జరిగిన ఆడియో ఫంక్షన్ కే ఛీఫ్ గెస్ట్ గా రమ్మని బాలయ్యను పిలవడానికి జంకేసారు కళ్యాణ్ రామ్. వెళ్తే ఏమంటారో? ఎలా స్పందిస్తారో? అన్న అనుమానం. బాలయ్యకుకళ్యాణ్ రామ్ మధ్య మంచి సంబంధాలే వుండేవి. కానీ ఈ మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్లు కనిపిస్తోంది. అందుకే ఫంక్షన్ వ్యవహారం పక్కన పెట్టేసారు. మరి అలాంటిది సినిమా గురించి అడగగలరా? అడిగినా చేస్తారా? అనుమానమే. మరో సీనియర్ హీరోను ఎవరినో సెట్ చేసుకుని కానిచ్చేసుకోవాలి. అలా చేస్తే, పాపం, పవన్ సాధినేని కోరిక, కల నెరవేరుతాయా? సావిత్రి సినిమా తరువాత సరైన సినిమా పడకుండా, ఈ స్క్రిప్ట్ నే  పట్టుకుని కూర్చుకున్నాడు అతను. 


మరింత సమాచారం తెలుసుకోండి: