ఈ మద్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియం పుణ్యమా అని విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంటున్నారు.  కొంతమందికి ఒక్క నైట్ లోనే స్టార్ హోదా వచ్చిపడుతుంది.  మళియాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ య్యూట్యూబ్ లో వచ్చిన సాంగ్ లో కన్నుగీటి కోట్ల మంది హృదయాలు కొల్లగొట్టింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియా  సర్చ్ చేస్తే..ఈ అమ్మడి ఫోటోలు విపరీతంగా వస్తున్నాయి. 

ఇక సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే తమ కెరీర్ అంత బావుంటుందని భావిస్తుంటారు సినిమా, టీవీ నటులు.  సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫీట్లు చేస్తుంటారు.  ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ 'యే హై మొహబతేన్' నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తాజాగా పోస్టు చేసిన ఓ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అందులో ఓ ఏలియన్‌ చేసినట్లుగా ఆమె డాన్సు చేసింది.   'ఈ ఏలియన్‌తో కలిసి డాన్స్ చేసేంత వరకు ఇది నన్ను విడిచిపెట్టలేదు' అంటూ ఆమె సరదాగా ఈ వీడియోకి సంబంధించి ట్వీట్ చేసింది. ఈ వీడియో ఒకసారి చూసిన వారు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఆమె డాన్స్ అద్భుతంగా ఉంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు రోజుల్లో 3.5 మిలియణ్ వ్యూస్ వచ్చాయి. దివ్యాంక త్రిపాఠి డాన్స్ వీడియో   సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: