నిన్న మొన్నటిదాకా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ మీద జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ విషయాల మీద ఘాటుగా స్పందించి స్టార్ హీరోలను దర్శక నిర్మాతలను ఎవరిని విడిచి పెట్టకుండా రఫ్ఫాడించిన హీరోయిన్ శ్రీ రెడ్డి లేటెస్ట్ ఇంటర్వ్యూలో రూట్ చేంజ్ చేసింది. వారం రోజులుగా యూట్యూబ్ లో షేక్ చేస్తున్న అమ్మడు కో ఆర్డినేటర్స్ మీద దుమ్మెత్తిపోసింది.


అవకాశం వస్తే ఎవరైనా సరే హీరోయిన్స్ ను వాడుకునేందుకు వెనుకాడరంటూ ఘాట్ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు బూతు మాటలను కూడా బాగానే వాడేసింది. ఇక అదంతా జరిగిన కథ.. ఇక టాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరితో మీరు డేటింగ్ కు వెళ్తారు అని అడిగితే. క్షణం ఆలోచించకుండా బన్ని అనేసింది.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జీ బాగుంటుందని.. ఆ ఎనర్జీ చూస్తే శ్రీ రెడ్డి ఆయనకు ఫ్యాన్ అయ్యిందట. అంతేకాదు బన్ని ఒప్పుకుంటే మాత్రం తాను డేటింగ్ కు వెళ్లేందుకు రెడీ అంటుంది శ్రీ రెడ్డి. అక్కడితో ఆగితో బాగుండేది మెంటాలిటీ ప్రకారం బన్నికి తనకు పోలికలు ఉంటాయని ఏదో దగ్గర మన్షి చెప్పినట్టుగా మాటలు చెప్పింది అమ్మడు.


మొన్నామధ్య మెగా హీరోతో ఒకరితో తాను పడుకున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు బన్నితో ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధమే అని చెప్పడం అందరిని ఆశ్చర్య పరచింది. రీసెంట్ గా వివాదాస్పద వ్యాఖ్యలతో ఆడియెన్స్ లో మైలేజ్ ఏర్పరచుకున్న శ్రీరెడ్డి దీని వల్ల కెరియర్ కు ఎంత బూస్టింగ్ దొరుకుంతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: