ఈ మద్య  కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో తెలుగు సినీ పరిశ్రమ గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న కొంతమందిపై సినీ నటి, యాంకర్ మంచు లక్ష్మి సీరియస్ అయ్యారు.  సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళల గురించి టీవీ చానెల్ ఎడిట‌ర్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొద‌ట ప్ర‌త్యేక హోదా విష‌యం గురించి సినిమా వాళ్లు స్పందించ‌రా.. బానిస‌లుగానే బ‌తుకుతారా అంటూ ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్టాడారు.
Image result for mlc rajendra prasad
దీంతో పార్టీ పటిష్టత దెబ్బ తింటుందని తెలిసి తన మాటల వెనక్కితీసుకుంటున్నానని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.   కాగా, ఇదే అంశంపై నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి తో ఓ టీవి ఛానెల్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. తెలుగు సినిమా వాళ్ల గురించి హ‌ద్దులు మీరి మాట్లాడుతున్నార‌ని, సినీ న‌టీమ‌ణుల గురించి నోరు జార‌ర‌ని చెబుతూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ క‌న్నెర్ర చేసింది.
Image result for posani krishna murali
క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆ ఎడిట‌ర్‌పై ప‌లువురు సినీ పెద్ద‌లు మండిప‌డ్డారు. ఈ వివాదంపై మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'విషయం ఏదైనప్పటికీ మహిళలను ఇలా లేబులింగ్ చేస్తూ ఏ ఒక్కరు కూడా అలాంటి మాటలు మాట్లాడరాదు. నటీమణులను ఉద్దేశిస్తూ అలా మాట్లాడటాన్ని ఏ ఒక్కరూ సహించరు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. పబ్లిసిటీ కోసం సినీ పరిశ్రమలోని మహిళలను ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడటం కన్నా నీచమైనది మరొకటి ఉండదు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: