టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియాశరన్ తర్వాత అగ్ర హీరోలతో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  ఇప్పటికీ హీరోయిన్ నటిస్తూ యంగ్ హీరోయిన్లకు పోటీగా నటిస్తుంది శ్రియ.  మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ తెలుగు, తమిల, మళియాళ, హిందీ,కన్నడ ఇండస్ట్రీలో నటించింది.  ఆ మద్య శ్రియ నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది. 
Image result for actress-shriya-saran
ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఇట్టే ఇమిడిపోయే శ్రియ ఆ మద్య బాలకృష్ణ నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలో అద్భుతంగా నటించింది.  ఆ తర్వాత పైసా వసూల్,గాయత్రి సినిమాలో నటించింది.  అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ మద్యనే తన రష్యన్ బాయ్ ఫ్రెండ్‌ ఆండ్రీ కోస్‌చీవ్‌ను పెళ్లాడి షాక్ ఇచ్చింది.  ఇదిలా ఉంటే..టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రియ శరన్ ఇక సినిమాలకు గుడ్ చెప్పేస్తుందా? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Related image
ఆండ్రీ కోస్‌చీవ్‌ను పెళ్లాడిని ఈ సీనియర్ బ్యూటీ ఇక సినిమాలకు స్వస్తి చెప్పి తన భర్తతో రష్యాలో సెటిల్ అయ్యేందుకు టాలీవుడ్‌నుండి తట్టా బుట్టా సర్దేసేపనిలో పడిందట. అందుకే పెళ్ళికి ముందు వెంకీతో నటించేందుకు ఒప్పుకున్న ఆ ఒక్క సినిమాను కూడా క్యాన్సిల్ చేసుకుంద‌ని స‌మాచారం.
Image result for actress-shriya-saran marriage
ఇప్పటి వరకు తన నట ప్రస్థానంలో ఎలాంటి కాంట్ర వర్సీలు లేకుండా కూల్ గా తన కెరీర్ కొనసాగించింది.  ప్రస్తుతం తేజ  దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వెంకీ సరసన ముందుగా శ్రియను అనుకున్నారు. అయితే శ్రియ ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవడంతో కొత్త నటి కోసం వేట మొదలు పెట్టారట చిత్ర యూనిట్. అయితే దీనిపై అఫీసియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: