సీనియర్‌ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్ చంద్రమౌళి గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య బారీన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చివరి శ్వాస వదిలారు. చంద్రమౌళి మృతిపట్ల పలువురు సినీప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సినిమాలలోకి పరిమితమే అవకుండా బుల్లితెర మీద కూడా ప్రేక్షకులను అలరించాడు.


ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా లోని శ్రీకాళహస్తిలో గల తాలుకా మునగలపాలెం గ్రామం. 47 ఏళ్ల సినీ కెరీర్లో  నటుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా కళామతల్లికి సేవలు అందించాడు. సినిమా రంగానికి రాకముందు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తండ్రిగారైన మంచు నారాయణస్వామి నాయుడు వద్ద నటనలో శిక్షణ పొందాడు.


ఆయన ఇప్పటివరకు దాదాపు 200 సినిమాల్లో నటించారు. కెరీర్  ఆరంభం నుండి కేవలం చిన్న చిన్న పాత్రలకే పరిమితయ్యాడు. అయితే ప్రధాన పాత్రలు రాకపోవడం పట్ల తానెప్పుడూ బాధపడలేదని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. రంగుల ప్రపంచం సినిమా రంగం అంటే పిచ్చితోనే తాను ఈ  రంగంలో ఉంటున్నానని, ఏ పాత్ర వచ్చినా ఆనందంగా స్వీకరిస్తానని చెప్తుండేవాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: