వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది.   'కాస్టింగ్ కౌచ్‌'పై కొందరు దర్శకులు, ప్రముఖులపై నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.  తన దగ్గర కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఆధారాలున్నాయన్న ఈ ముద్దుగుమ్మ చేస్తున్న హంగామాతో అప్పట్లో కోలీవుడ్ లో సుచీ లీక్స్ లా తయారైంది.  సుచీలీక్స్ ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది నటీ, నటుల గురించి ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం పెను వివాదాలకు దారి తీసింది. మొన్న బడా ప్రొడ్యుసర్ రమేష్ పుప్పాల, నిన్న శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

దీనిపై దర్శకులు శేకర్ కమ్ముల సీరియస్ గా వార్నింగ్ ఇస్తూనే..ఇలాంటి చీఫ్ ట్రిక్స్ వల్ల ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బంది పడతారని అన్నారు.  తాజాగా ఈ లిస్ట్‌లోకి ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్ శ్రీరామ్ చేరడం సంచలనం రేపుతోంది. ఇండియన్ ఐడల్ టాలీవుడ్, బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీరామ్.  ఆ మద్య ఓ సినిమాలో హీరోగా కూడా నటించాడు. 
Image result for sri reddy
తెలుగు సినిమాల్లో సింగర్ గా కెరీర్ కొనసాగిస్తున్న శ్రీరామ్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా ‘చూడండి.. ఇండియన్ ఐడల్ చాట్ .. షేమ్ ఆన్ యు శ్రీరామ్’ అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా లీక్ చేసేసింది శ్రీరెడ్డి. ఈ చాట్‌లో శ్రీరామ్.. ఆమె బాడీ పార్ట్స్ గురించి పదే పదే ప్రస్తావించడం.. ఫోటోలు పంపాలని అడగడం కనిపించింది. అయితే శ్రీరెడ్డి లీక్స్ పేరుతో విడుదల చేసిన తాజా లీక్స్‌పై మండి పడుతున్నారు నెటిజన్లు.
Image result for sri reddy
నువ్వు హాట్ గా రిప్లై ఇస్తుంటే..అవతలి వ్యక్తి కూడా అదే తరహాలో రిప్లై ఇస్తున్నారు..ఇందులో  ఇద్దరిదీ తప్పు ఉంది. నువ్ రొమాంటిక్‌గా మాట్లాడావ్.. అతడూ రొమాంటిక్‌గానే మాట్లాడాడు అని అంటున్నారు. ఇదిలా ఉంటే..తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని, అప్పటి వరకూ తనను ఎవరెవరు వాడుకున్నారో ఆధారాలతో సహా బయటపెడతా అంటూ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది శ్రీరెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: