తెలుగు సినిమాలు కూడా కొన్ని చేసిన భావన కృష్ణ వంశీ మహాత్మా లో శ్రీకాంత్ సరసన చెప్పుకోదగ్గ పాత్ర చేసింది కాని అది ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో కన్నడ వైపు వెళ్లిపోయింది. అక్కడి అగ్ర హీరోలదరి సరసన సినిమాలు చేసిన భావన తమిళ్ లో సైతం అజిత్ లాంటి హీరోలతో చెప్పుకోదగిన సినిమాలు అక్కడ కూడా చేసింది. స్వతహాగా మలయాళీ అయిన భావనకు ఈ రెండు బాషల్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

కిడ్నాప్ - లైంగిక వేధింపు గురించి బాహాటంగా చెప్పి నిందితులు కోర్టుకి ఈడ్చింది.  భావన చేసిన ధైర్యానికి పలు సిని ఇండస్ట్రీ సెలబ్రెటీలు ఆమెకు అభినందనలు తెలిపారు.  తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది..భావన లైంగిక వేధింపుల కేసులో నన్న బలిచేశారని హీరో దిలీప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   భావన కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసుపై స్టార్ నటుడు దిలీప్, ప్రధాన నిందితుడు పల్సర్ సునీలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తమ ఇద్దరినీ ప్లాన్ ప్రకారం ఇరికించారని వారిద్దరూ వాదిస్తున్నారు. 

హీరోగా తాను మంచి పొజీషన్లోకి వస్తున్న సమయంలో కొంత మంది గిట్టని వారు తనపై కుట్ర పన్నారని..అనవసరంగా లేని పోని ఆరోపణలు చేసి తనను నేరస్తుడిగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు దిలీప్. ఈ కేసులో నెలల పాటు జైల్లో నిందితుడిగా గడిపి బెయిల్ పై బయటకు వచ్చిన దిలీప్ మాట్లాడుతూ, తనను ట్రాప్ చేసి తన మాజీ భార్య మంజు వారియర్, దర్శకుడు, నటుడు లాల్ ఇరికించారని చెప్పాడు.
Image result for actress bhavana rape case
తన భార్యతో తనకు విభేదాలున్నాయని, అలాగే లాల్ తో తనకు పడదని, వీరిద్దరూ కలిసి తనను పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. తన మాజీ భార్యకు భావన  స్నేహితురాలు కావడంతో బహుషా ఆమెను పావుగా వాడుకున్నారేమో అని అనుమానం ఉందని దిలీప్ అన్నారు. దీనిపై పల్సర్ సునీలు మాట్లాడుతూ, కిడ్నాప్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఈ కేసులో తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: