అనుష్క అనడం కంటే ఇప్పుడు భాగమతి అంటే బాగా గుర్తు పడ్తారేమో.. అంతకుమించి దేవసేన అని పిలిస్తే ఇక తిరుగే ఉండదు. ఇటీవలికాలంలో బాహుబలిలో దేవసేనగా, ఆ తర్వాత భాగమతిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుష్క. అయితే ఒక్కసారిగా ఆమె గతంలోకి వెళ్లిపోయి కొన్ని స్వీట్ మెమొరీస్ ను షేర్ చేసుకుంది.

Image result for anushka

          అనుష్క సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. చాలా అరుదుగా మాత్రమే ఆమె ఫ్యాన్స్ ను పలకరిస్తుంటారు. ఏదైనా సినిమా ఫంక్షన్లలో అలా మెరవడం, ఎప్పుడో ఓసారి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప అనుష్క బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎలాంటి ప్రశ్నలు వేసినా చిరునవ్వుతో సమాధానమిస్తుంటారు. ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకుపోయే తత్వం స్వీటీది. అదే ఆమె అందం కూడా.!


            తాజాగా ఆమె ఫేస్ బుక్ లో ఓ ఫోటో పెట్టి మురిసిపోయారు. తన చిన్ననాటి ఫోటోను ఫ్యాన్స్ తో పంచుకున్న స్వీటీ... గతం ఎంత బాగుంటుందో.. అంటూ మైమరచిపోయారు. “పుట్టిన ఊరికి వెళ్లినప్పుడు మనం మిస్ అయ్యేది కేవలం ఆ ఊరినే కాదు.. మన బాల్యాన్ని కూడా.. నిజంగా ఆ రోజులు చాలా అద్భుతమైనవి. ఇప్పుడు నేను అక్కడే ఉన్నా..అనుకుంటున్నా..” అని గతాన్ని నెమరు వేసుకున్నారు. అనుష్క షేర్ చేసుకున్న ఫోటోలో తల్లిదండ్రులతో పాటు తన ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. తెల్లగౌనులో స్వీటీ ముద్దుముద్దుగా ఉంది.

Related image

          అనుష్క చిన్ననాటి ఫోటోను చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి. కొన్నింటికి స్వీటీ సమాధానాలు కూడా ఇచ్చారు. ఏదైతేనేం చాలా కాలం తర్వాత స్వీటీ సోషల్ మీడియాను పలకరించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: