తమిళ హీరో విజయ్‌ఆంటోనీ కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి.   విజయ్‌ఆంటోనీ, అంజలి, అమృత ప్రధాన పాత్రల్లో త‌మిళంలో రూపొందిన మూవీ కాళి.. ఈ మూవీని తెలుగులో కాశీ పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘కాశీ’ చిత్రంపై కొత్త వివాదం చెలరేగింది. ఈ మూవీ విడుద‌లపై చెన్నై కోర్టు స్టే ఇవ్వ‌డంతో రిలీజ్ ఆగిపోయే ప్ర‌మాదంలో ప‌డింది..షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంపై నిషేధం విధించాలని కోరుతూ ఒక డిస్ట్రిబ్యూట‌ర్ చెన్నై కోర్టుకెళ్లారు. 
Image result for vijay antoni kashi
గతంలో విజయ్ ఆంటోని నటించిన ‘అన్నాదురై’ని తాను పంపిణీ చేసి, భారీగా నష్ట పోయానని, ఆ సమయంలో ‘కాళి’ పంపిణీ హక్కుల్ని తక్కువ ధరకే తనకు ఇస్తానని విజయ్‌ ఆంటోనీ, ‘కాళి’ నిర్మాత అయిన ఆయన సతీమణి హామీ ఇచ్చారని వివ‌రించారు.  ఆ సినిమా హక్కుల కోసం రూ.50 లక్షలు కూడా అడ్వాన్స్ ఇచ్చానని..ఇప్పుడు తమిళ నాట సమ్మే జరుగుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావడం లేదని..ఎవ్వరూ కొనడం లేదని వాపోయారు. 
Related image
దీంతో బాకీ సొమ్ము చెల్లించలేక పోయానని, దీన్ని ఆసరా గా చేసుకుని ‘కాళి’ పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేస్తానంటూ విజయ్‌ ఆంటోనీ తనకు నోటీ సులు పంపారని పిటిషన్‌లో వివరించారు.  దీనిపై విచారణ జరిపిన కోర్టు ‘కాళి’ విడుదలపై స్టే విధించింది.ఈ మూవీకి కృతిక ఉద‌య‌నిధి అనే మ‌హిళ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: