టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురి బండారం బయటపెట్టిన శ్రీరెడ్డి.. తాజాగా మరో వ్యక్తిని తెరపైకి తెచ్చింది. చిరంజీవితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వాకాడ అప్పారావును టార్గెట్ చేసింది. చిరంజీవి పేరు చెప్పుకుని ఈయన వందలాది మంది ఆడవాళ్లను వాడుకున్నారని ఆరోపించింది.


తన పైన విధించిన నిషేధాన్ని ‘మా’ ఎత్తేసిన తర్వాత కూడా శ్రీరెడ్డి తగ్గట్లేదు. ఇండస్ట్రీలోని పలువురు వ్యక్తుల బంఢారం బయటపెడ్తానని చెప్తూ వచ్చిన శ్రీరెడ్డి అన్నట్టుగానే పలువురి చిత్రాలను, వాట్సాప్ చాట్ లను విడుదల చేసింది. తాజాగా పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన వాకాడ అప్పారావు బాగోతాన్ని శ్రీరెడ్డి బయటపెట్టింది. “మెగాస్టార్ చిరంజీవి గారూ.. ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు. దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి” అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

Image result for sri reddy with chiranjeevi

చిరంజీవి పేరు చెప్పుకుని వాకాడ అప్పారావు చాలా మంది జీవితాలతో ఆడుకున్నారనేది శ్రీరెడ్డి ఆరోపణ. 16 ఏళ్ల వయసున్న ఆడపిల్లలను కూడా వదల్లేదని శ్రీరెడ్డి ఆరోపించింది. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించవద్దని చిరంజీవిని వేడుకుంది.  కేవలం పోస్టుకు మాత్రమే పరిమితం కాకుండా వాకాడ అప్పారావు ఫోటోను కూడా పెట్టింది. ఇదిప్పుడు టాలీవుడ్ లో సంచలనం కలిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: