సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ ల పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అయితే మన టాలీవుడ్లో అత్త క్యారెక్టర్ కూడా చాలా ప్రధానమైనది. అందుకే డైరక్టర్లు ఈ పాత్రధారి కోసం ఆచితూచి వ్యవహరించి సెలెక్ట్ చేస్తారు. గతంలో వచ్చిన ఘరానా బుల్లోడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు నుండి మొన్న వచ్చిన అత్తారింటికి దారేది సినిమా వరకు అత్త క్యారెక్టర్ ఎలాంటిదో వర్ణిస్తాయి.


అయితే ఆనాడు అత్త పాత్రలకు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండేవారు. కానీ నేడు మాత్రం ఏకంగా సీనియర్ హీరోయిన్లు పోటీ పడుతున్నారు. పెళ్లిచేసుకొని హీరోయిన్ క్యారెక్టర్ కు స్వస్తి పలికి మళ్ళీ అత్త పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇంకో ప్రముఖ సీనియర్ హీరోయిన్ చేరబోతోంది. ఆమె ఎవరో కాదు కలిసుందాం..రా!, నరసింహనాయుడు వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సిమ్రాన్.


తాజాగా కోలీవుడ్లో శివ కార్తికేయన్, సమంత హీరోహీరోయిన్లుగా  తెరకెక్కిస్తున్న సినిమాలో సిమ్రాన్ అత్త పాత్రలో నటిస్తున్నదని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇందులో ఆమెకు జోడిగా మలయాళ నటుడు లాల్ నటిస్తున్నాడని సమాచారం. అంతేగాక  తెలుగులో సప్తగిరి హీరోగా నటించబోయే  సినిమాలో కూడా సిమ్రాన్ నటించబోతుందని సమాచారం. మరి సెకండ్ ఇన్నింగ్స్లోసిమ్రాన్ ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: