రంగస్థలం సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లో కలెక్షన్లతో దుమ్మురేపుతుంది.  మగధీర తర్వాత ఆ రేంజ్ లో గొప్ప విజయం సాధించిన సినిమా ‘రంగస్థలం’ కావడం విశేషం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాంచరణ్ చిట్టి బాబు పాత్రలో జీవంచారని..పలువురు సెలబ్రెటీలు ప్రశంసల జల్లు కురిపించారు.  నిన్న హైద్రాబాద్ లోని యూసఫ్ గుడలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్.. జనసంద్రంగా మారిపోయింది. ఇందుకు కారణం.. రంగస్థలం సక్సెస్ మీట్ ను ఇక్కడ నిర్వహించడం అనే విషయం మెగా ఫ్యాన్స్ కు చెప్పాల్సిన పని లేదు. 

సినిమా సూపర్ సక్సెస్ అయిపోయి.. బ్లాక్ బస్టర్ రేంజ్ దాటేసి.. ఇండస్ట్రీ హిట్ స్థాయికి చేరిన తర్వాత నిర్వహిస్తున్న అసలు సిసలైన సక్సెస్ మీట్ ఇది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చేసిన సందడి అంతా ఇంతా కాదు..అప్పటి నుంచి సినిమాపై విపరీతమైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇంత గొప్ప సక్సెస్ సాధించిన ఈ సినిమా సక్సెస్ మీట్ కి చిరు కి బదులు..పవన్ కళ్యాన్ రావడం ప్రత్యేకం అయ్యింది.

ఈ సందర్బంగా రాంచరణ్ మాట్లాడుతూ.. తనకు అసలు మాటలు రావడం లేదని అన్నాడు. చాలా మాట్లాడదామని అనుకున్నా.. అన్నీ తలలోంచి జారిపోయి.. ఇప్పుడు పంచెలోకి జారిపోయాయని చెప్పాడు. ఎదురుగుండా పవన్ కళ్యాణ్ బాబాయ్ ను చూస్తే మాటలు రావడం లేదని.. పోనీ వెనకాల చూసి మాట్లాడదాం అంటే.. బోలెడంత మంది ఫ్యాన్ సముద్రం చూసి అసలు మాటలు రావడం లేదని అన్నాడు. ఈ సినిమా చూశాక ముగ్గురు వ్యక్తుల రియాక్షన్ నేను మర్చిపోలేను. మమ్మీ డాడీ ప్రతిస్పందనతో మాటలు రాలేదు.

అమ్మ రియాక్షన్ మనసులో నిండిపోయింది. ఇక ఈ సినిమా బాబాయిని ఇంటికి వెళ్లి చూడమని అడగాలనుకున్నాను..కానీ బాబాయే నాకు ఫోన్ చేసి  ఇంటికి రారా అన్నారు. సినిమా చూస్తానని చెప్పారు. దాంతో తెగ సంతోషపడిపోయానని..ఇంట్లో షో వేయిస్తానని అన్నాను..కానీ బాబాయి వద్దు ప్రివ్యూ థియేటర్ లో చూద్దామంటే అబ్బే వద్దు అనేశారు. కానీ తన సినిమా తొలి ప్రేమ ఇలా థియేటర్లో చూశారట.. ఇప్పుడు మళ్లీ రంగస్థలమే చూసారట. థ్యాంక్యూ బాబాయ్ మళ్లీ మళ్లీ' అంటూ తన స్పీచ్ ముగించాడు మెగా పవర్ స్టార్.


మరింత సమాచారం తెలుసుకోండి: