టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక వైపు శ్రీ రెడ్డి బడా తిమింగలాల భాగోతాలను బయటపెడుతుంటే, మరోవైపు క్యారెక్టర్ పాత్రలు వేసే నటీమణులు సైతం చిన్న చేపల  బండారాలను బట్టబయలుచేస్తున్నారు. తాజాగా సినీ క్రిటిక్, బిగ్ బాస్ షో ఫేమ్ కత్తి మహేష్ తనను వాడుకున్నాడంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బాంబు పేల్చింది.


ఆమె మాట్లాడుతూ " కత్తి మహేష్ నాకు సంవత్సరం నుండి తెలుసు. ఫేసుబుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఒకసారి అమీతుమీ ప్రోగ్రామ్ చేసేప్పుడు ఆయనకి ఉన్న  క్రేజ్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆ తరువాత ఆయనను బిగ్ బాస్ షోలో చూసి అవాక్కయ్యాను. ఒక ఫిలిం క్రిటిక్ ఇలాంటి జాతీయ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా ఆనందం కలిగింది" అని చెప్పింది.


ఆమె ఇంకా చెబుతూ " బిగ్ బాస్ షో నుండి కత్తి మహేష్ ఎలిమినేట్ అయిన తరువాత ఒక సారి ఆయన నన్ను కలవాలని చెప్పి  ఫేసుబుక్లో అడ్రస్ పెట్టాడు. దీంతోనేను అక్కడికి వెళ్లగా కమిట్మెంట్ ఇవ్వమని అడిగాడు. దానికి నేను ససేమిరా అన్నాను. దీంతో నన్ను బలవంతంగా లొంగదీసుకోవాలనుకున్నాడు. చివరలో 500 బస్సు టికెట్ కు ఇచ్చి పంపించాడు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.


అయితే కత్తి మహేష్ ఆమె వాఖ్యలకు స్పందించాడు. ఒక ఛానెల్ లో ఒక నటి నామీద చేసిన ఆరోపణలు నాకు షాక్ ని కలిగించాయి. పోలీసులు ఈ విషయంపైన దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని   డిమాండ్ చేస్తున్నా " అంటూ ట్వీటు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: