ఈ మద్య యువతపై సినిమాల ప్రభావం బాగా పడుతుందని..ఒక రకంగా యువత పెడదారి పట్టడానికి సినిమాలే కారణం అంటూ ఆరోపణలు వస్తున్నాయి.  ఈ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పలు వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమమే చేపట్టింది.  తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఏదైనా చిన్న వేశాలు వేయడానికి వచ్చినా..కొంత మంది దళారులు వారిని దారుణంగా మోసం చేయడం..శారీరకంగా, మానసికంగా వేధించడం జరుగుతుందని ఆరోపిస్తుంది. 
Related image
ఇదిలా ఉంటే..ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న దారుణాలకు, మహిళలపై అకృత్యాలకు పనికిమాలిన సినిమాలే కారణమని మీకు తెలుసా?... చెత్త సినిమాల ప్రభావంతో చాలా మంది పిల్లలు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారని నేను భావిస్తున్నా’ అంటూ ఓ నెటిజన్ ప్రముఖ యాంకర్, నటి రష్మీని ప్రశ్నించాడు.  గత కొంత కాలంగా జబర్ధస్త్ కామెడీ షోతో బాగా పాపులారిటీ సంపాదించింది అనసూయ, రష్మీ.   యాంకర్ గానే కాకుండా సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది రష్మి. 
Image result for jabardasth comedy show rashmi
సోషల్ మాద్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రష్మి తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యింది.  ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..సమాజం తప్పుదారిలో నడవడాన్ని ఏ సినిమా ప్రోత్సహించదని పేర్కొన్నారు. పనికిరాని సినిమాల ప్రభావం వల్ల చాలా మంది పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారంటూ అతడు చేసిన వ్యాఖ్యలను రష్మి ఖండించారు.  ‘ప్రతిదీ చిత్ర పరిశ్రమపైనే నెట్టేయకండి. మైనర్‌ బాలికను అత్యాచారం చేయడం సరైందేనని ఏ సినిమాలోనూ చూపించరు. సినిమాలో చూపించిన ప్రతి దాన్ని నేర్చుకునేలా ఉంటే.. ఎందుకు అందులోని మంచిని స్వీకరించడం లేదు. ఇలాంటివి అర్థరహిత వ్యాఖ్యలు’ అని కొట్టిపారేశారు.
Image result for Katuva-Child
ఈ మద్య కథువా  ఘటనపై స్పందించింది. ప్రజల్లో మానవత్వం, విలువలు పూర్తిగా మంటగలిసిపోయాయి.. ఓ చిన్నారిపై ఇలాంటి అఘాయిత్యానికి ఎలా పాల్పడ్డారని’ ప్రశ్నించారు. ‘పిల్లలు మన చేతుల్లో ఉంటే సురక్షితమని భావిస్తారు.. అలాంటిది ఆడ పిల్లలను రక్షించలేమని భావిస్తే పిల్లల్ని కనక్కర్లేదు’అంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సైతం స్పందిస్తూ... చిన్నారికి న్యాయం జరగాలని, దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: