గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి మొదలు పెట్టిన ఉద్యమం..ఇప్పుడు బాధితులను ఏకతాటిపైకి తీసుకు వస్తుంది.  ఇండస్ట్రీలో పెద్దల చేతుల్లో నలిగిపోతున్న మహిళా నటులు ఒక్కొక్కరుగా తమ గళాన్ని విప్పుతున్నారు.  ఇప్పటికే పలువురు సైడ్ క్యారెక్టర్స్, జూనియర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో చాన్స్ రావాలంటే..తప్పని సరి పక్కలో పడుకోవాల్సిందే...లేదంటే చాన్స్ లు రావని తేల్చి చెబుతున్నారు.  ఇలా ఎంతో మంది 15 సంవత్సరాల అమ్మాయిల నుంచి ఆంటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే శ్రీరెడ్డి నెల రోజుల నుంచి వివిధ ఛానల్స్ లో తన గోడు వెల్లబూచ్చినా..ఆ మద్య ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత ఈ వివాదం కాస్త నేషనల్ స్థాయికి వెళ్లింది. దాంతో అప్పటి వరకు మొండి పట్టు పట్టిన ‘మా’ అసోసియేషన్ దెబ్బకు దిగి వచ్చి శ్రీరెడ్డి డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.  తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బాధితులు తమ ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. ఓ కార్యక్రమంలో సోనా రాథోడ్ అనే ట్రాన్స్ జెండర్ తను అనుభవించిన వ్యథను చెబుతుంటే, అక్కడే ఉన్న నటి శ్రీరెడ్డి, అపూర్వ, మహిళా సంఘం నేత సంధ్య తదితరులు కన్నీరు పెట్టుకున్నారు.

తాను చిన్నతనంలోనే ఇంటి నుంచి వచ్చానని..నాలుగు సంవత్సరాల వరకు జూనియర్ ఆర్టిస్ట్ లను సప్లై చేసే వారితో ఉన్నానని..ఆ సమయంలో వారు ఒక్కరోజు క్యారెక్టర్ ఇచ్చినందుకు అమ్మాయితో నలుగురు పడకసుఖం అనుభవించే వారని తాను ట్రాస్స్ జెండర్ గా మారిన తర్వాత తనపై కూడా అఘాయిత్యాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేసింది.  తాను ట్రాన్స్ జెండర్ నని తెలిసినా వదల్లేదని, సినిమాల్లో అవకాశం కోసం వెళితే, 'నువ్వు ట్రాన్స్ జెండర్ వేనా?' అని బట్టలు విప్పించారని, ఆపై పడుకోవాల్సిందేనని అన్నారని, ఆ పని చేస్తేనే వేషం ఇస్తామని చెప్పారని విలపించింది. 

హైదరాబాద్, సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ వేదికగా, మహిళా నటులు, మహిళా సంఘాల ప్రతినిధులు బహిరంగ చర్చ జరుపగా, పలువురు జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు.  చాన్సుల కోసం వచ్చే అమ్మాయిలను పక్కలోకి రమ్మంటున్న నిర్మాతలు, హీరోలు సహా అందరి పేర్లనూ సాక్ష్యాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: