మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో తన డ్యాన్స్ లతో మైమరపించిన ముమైత్ ఖాన్ తెలుగులో నటించిన చివరి చిత్రం 2016లో వచ్చిన ‘తిక్క’. ఈ సినిమా తర్వాత ఆమె స్క్రీన్ పై కనపడలేదు. 
Image result for mumaith khan big boss
కాకపోతే ఆ మద్య ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో ముమైత్ చాలా హంగామా చేసింది.  ఒకసారి వెళ్లిపోయి..మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత కొన్ని సార్లు బుల్లితెరపై కనిపించింది ముమైత్.  ఆ మద్య డ్రగ్స్ కేసులో ముమైత్ పేరు కూడా వినిపించింది. సిట్ ముందు ఈమె కూడా హాజరైంది..ఆ సమయంలో బిగ్ బాస్ షోలో నటిస్తుంది.  అయితే కొన్ని రోజులుగా సినిమాలో నటించకపోవడానికి గల కారణం చెప్పింది ముమైత్.
Image result for mumaith khan big boss
తాను ఇన్నాళ్లూ తెరపైకి రాకవపోడానికి గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా ముమైత్ ఖానే వెల్లడించింది. రెండేళ్ల పాటు తాను మూర్ఛ వ్యాధితో బాధపడ్డానని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నానని చెప్పింది.వైద్యులు సూచనల మేరకు రెండేళ్ల వరకు ఎలాంటి బరువులు మోయకూడదని చెప్పారని తెలిపింది.
Image result for mumaith khan big boss
చాలా లావై పోయానని, కానీ, ఎటువంటి ఇబ్బందిగా లేదని, తాను కోలుకున్న అనంతరం తన దేహదారుఢాన్ని సరైన ఆకృతిలోకి మలచుకుంటానని, అలా చేయడం తనకు చాలా సులభమని చెప్పింది. ప్రతిరోజు మంచి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేస్తే మన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని ముమైత్ తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: